
ట్యాగ్ · 7 కథనాలు


ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్న డానీ..!

'భీమ్లా నాయక్' నిజంగా పవర్ తుఫానే..!

'భీమ్లానాయక్' మూవీపై వర్మ రివ్యూ..!

"భీమ్లా నాయక్"మూవీ పై హరీష్ శంకర్ స్పందన

'భీమ్లానాయక్' విషయంలో హర్ట్ అవుతున్నా..సంయుక్త మీనన్ కౌంటర్..!
భీమ్లానాయక్ విషయంలో హర్ట్ అవుతున్నా అంటుంది ఆసినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన సంయుక్త మీనన్. ఇంతకీ ఏం విషయంలో సంయుక్త మీనన్ హర్ట్ అవుతుంది.. ఆ కథ ఏంటి అన్న సంగతి తెలియాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి కాంబినేషన్ లో వచ్చిన సినిమా భీమ్లానాయక్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం అయితే బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతూ దూసుకుపోతుంది. రిలీజ్ అయిన మూడు నాలుగు రోజులకే వంద కోట్ల క్లబ్ లో చేరిదంటే ఈసినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక పవన్ ఫ్యాన్స్ అయితే రెండు మూడుసార్లు సినిమాను చూసేస్తున్నారు.

'భీమ్లానాయక్'.. రికార్డ్ స్థాయిలో ఫస్ట్ డే కలెక్షన్స్..!
సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి కలిసి నటించిన లేటెస్ట్ మూవీ భీమ్లానాయక్. పేరుకు మాత్రమే ఈసినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్.. కానీ చాలా వరకూ కథలో మార్పులు చేసి.. తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టు సినిమా తీశారు. ఇక అదే ఇక్కడ వర్కవుట్ అయి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. త్రివిక్రమ్ డైలాగ్స్, పవన్-రానాల స్క్రీన్ ప్రెజెన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా అన్నీ తోడై.. సినిమా విజయంలో భాగమయ్యాయి. అందుకే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆటతోనే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని దూసుకుపోతోంది. మొదటిరోజే సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టి బాక్సాఫీస్ వద్ద…

ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్న డానీ..!
మొత్తానికి ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న భీమ్లానాయక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక వస్తూ వస్తూనే పవన్ బాక్సాఫీస్ వద్ద దండయాత్ర మొదలుపెట్టాడు. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇచ్చాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఇలాంటి పాత్ర చేయలేదని.. ఫుల్ మాస్ రోల్ లో పవన్ ఇరగదీశాడని ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ఎన్నో అడ్డంకులు ఉన్నా కూడా వాటన్నింటినీ అధిగమించి విజయబావుటా ఎగరవేసింది ఈసినిమా. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను కొల్లగొడుతూ దూసుకుపోతుంది. ఒక్క రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో కూడా "భీమ్లానాయక్ " మూవీ హవా నడుస్తుంది.

'భీమ్లా నాయక్' నిజంగా పవర్ తుఫానే..!
ఫిబ్రవరి 25.. పవన్ కళ్యాణ్ అభిమానులు క్యాలెండర్ లో మార్క్ చేసి పెట్టుకున్న డేట్ ఇది. ఈ రోజు కోసం ఎన్నో రోజుల నుండి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా డేట్ రానే వచ్చేసింది.. సినిమా రిలీజ్ అయిపోయింది.. ప్రీమియర్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. పవర్ స్టార్ మరోసారి తన సత్తా ఏంటో బాక్సాఫీస్ వద్ద చూపించాడు. ఎక్కడ చూసినా భీమ్లానాయక్ సినిమా గురించే చర్చలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ పవన్ కెరీర్ లో ఇలాంటి పాత్రలో.. ఇంత మాసీ లుక్ లో చూడలేదు. సినిమాలో పవన్ నటన కానీ అలానే పవన్-రానా మధ్య వార్ కానీ, యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా అన్ని సినిమాను విజయపథం వైపు నడిపించాయి…

'భీమ్లానాయక్' మూవీపై వర్మ రివ్యూ..!
సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా కాంబినేషన్ లో వచ్చిన భీమ్లానాయక్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాటలు, టీజర్ ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచగా... ఆ అంచనాలను ఇప్పుడు ఈసినిమా రీచ్ అయిపోయింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా భీమ్లా నాయక్ మ్యానియానే నడుస్తుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ షో నుండి సూపర్ హిట్ టాక్ ను సొంత చేసుకుంది. మరోపక్క థియేటర్ల వద్ద ఫ్యాన్స్ ఆనందంతో హంగామా చేస్తున్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు ఇతర సెలబ్రిటీలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు

'భీమ్లా నాయక్' రివ్యూ.. పవన్ నట విశ్వరూపం..!
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా పవన్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు ప్రతి వర్గం తప్పకుండా చూడాల్సిన సినిమా అని చెప్పొచ్చు. పవన్-రానా ల పెర్ఫామెన్స్, త్రివిక్రమ్ రైటింగ్, సాగర్ డైరెక్షన్, థమన్ మ్యూజిక్ ప్రతి ఒక్కటి ఫర్ఫెక్ట్ గా సెట్ అయి వచ్చిన ఈసినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకునే సినిమా ఇది.

"భీమ్లా నాయక్"మూవీ పై హరీష్ శంకర్ స్పందన
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ ఈ రోజు (25 వ తేదీ) భారీ ఎత్తున రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.“భీమ్లా నాయక్ ” మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.థమన్ ఎస్ సంగీతం అందించారు.