
ట్యాగ్ · 9 కథనాలు


నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానానికి 50 ఏళ్ళు

నందమూరి బాలకృష్ణ నటజీవితానికి 49 ఏళ్ళు పూర్తి

క్లైమాక్స్ లో బాలయ్య భగవంత్ కేసరి

NBK 108 లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్

"లెజెండ్" @ 8 ఇయర్స్

బాలకృష్ణ నెక్స్ట్ మూవీ ఫిక్స్ ?
మినిమమ్ గ్యాప్ తీసుకోకుండా సినిమాలు పూర్తి చేసే హీరోల్లో బాలకృష్ణ ఒకరు.ఒక సినిమా పూర్తయ్యే లోపు మరో సినిమాను లైన్లో పెడతాడు.అంతేకాదు అఖండ నుండి ప్లాప్ అన్నదే తెలియకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ఈ సీనియర్ హీరో.రీసెంట్ గా సంక్రాంతికి డాకు మహారాజ్ తో వచ్చి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.ఇక ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 చేస్తున్నాడు.బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తుంది.అఖండ సీక్వెల్ కావడంతో ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.తమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.

నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానానికి 50 ఏళ్ళు
టాలీవుడ్‌లోనే కాదు, ఏ చిత్ర పరిశ్రమలోనైనా ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం అనేది సాధారణ విషయం కాదు. ఈ అరుదైన ఫీట్ సాధించారు టాలీవుడ్ అగ్ర హీరో ‘నటసింహా’ నందమూరి బాలకృష్ణ. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, అలనాటి తెలుగు చలనచిత్ర అగ్ర నటుడు, దివంగత నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ నటుడిగా నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు.

నందమూరి బాలకృష్ణ నటజీవితానికి 49 ఏళ్ళు పూర్తి
నటసింహ నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ పరిశ్రమలో 49 గ్లోరియస్ ఇయర్స్ పూర్తి చేసుకున్నారు. నటుడిగా నేటితో 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. బాలకృష్ణ తన పుట్టిన రోజైన జూన్ 10కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో.. ఆగస్టు 30ని కూడా అంతే గొప్పగా చూస్తారు. ఎందుకంటే..? 'తాతమ్మకల' అనే సినిమాతో బాలకృష్ణ తొలిసారిగా తన 14వ ఏట సినిమా ఇండస్ట్రీలో అరంగేట్రం చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకూ బాలకృష్ణ దాదాపు ఐదు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తనదైన నటనతో అలరిస్తున్నారు. బాలకృష్ణ హీరోగా.. కథానాయకుడు, ముద్దుల మావయ్య, నారీ నారీ నడుమ మురారి, ఆదిత్య 369, భైరవద్వీపం, రౌడీ ఇనస్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా, లెజెండ్…

భగవంత్ కేసరి సెట్‌లో సందడి చేసిన నందమూరి మోక్షజ్ఞ
నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ గురించి అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే మోక్షజ్ఞ సినీ అరంగేట్రం గురించి తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఇంతవరకూ ఆయన ఎంట్రీ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాగా ప్రస్తుతం మోక్షజ్ఞ అమెరికాలో యాక్టింగ్ కోర్సు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మోక్షజ్ఞ తెరంగేట్రం చేయొచ్చనే టాక్ నడుస్తోంది. దీనికితోడు ఈ మధ్య మోక్షజ్ఞ తండ్రి సినిమాల షూటింగ్స్ మరియు సెట్స్‌ను తరచుగా సందర్శిస్తున్నాడు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లవుతోంది. ఇక బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో…

ఇస్మార్ట్ శంకర్‌తో రామ్ నాకొక సవాల్ విసిరాడు - నందమూరి బాలకృష్ణ
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో రామ్ తనకు ఒక సవాల్ విసిరాడని, దానిని తాను అందుకోవాల్సి ఉందని పేర్కొన్నారు టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ. శనివారం ఆయన హైదరాబాద్‌లో జరిగిన ‘స్కంద-ది అటాకర్’ ప్రీరిలీజ్ థండర్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ‘స్కంద’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న బాలకృష్ణ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. అలాగే ఇటీవలి ‘చంద్రయాన్ 3’ విజయంపై ఓ ప్రత్యేక గ్లింప్స్ విడుదల చేసి ఇస్రో టీమ్‌కు అభినందనలు తెలిపారు. ఇక కార్యక్రమంలో భాగంగా హీరో రామ్…

ఎవర్ గ్రీన్ క్లాసిన్ భైరవద్వీపం రీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. రీ రిలీజ్ ల సందడి ఎక్కువైంది. స్టార్ హీరోల బర్త్ డేలకు.. స్పెషల్ అకేషన్స్ కు సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు సినిమాలు రీ రిలీజ్ అయి సందడి చేశాయి. ఇక ఇప్పుడు మరో ఎవర్ గ్రీన్ క్లాసిక్ రీ రిలీజ్ కు సిద్దమైంది. ఆ సినిమా మరేదో కాదు బాలయ్య సినీ కెరీర్ లో ఎప్పటికీ గొప్ప సినిమాగా మిగిలిపోయే సినిమా భైరవద్వీపం.

క్లైమాక్స్ లో బాలయ్య భగవంత్ కేసరి
నట సింహం బాలకృష్ణ, సక్సెస్ పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా భగవంత్ కేసరి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈసినిమా రూపొందుతుంది. ఈ కాంబినేషన్ సెట్ అయినప్పటినుండే సినిమాకు మరింత హైప్ పెరిగింది. ఇక ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇక రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

NBK 108 లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్
అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్లను సొంతం చేసుకున్నాడు నటసింహాం బాలకృష్ణ. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు బాలయ్య అభిమానులు. ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు అనిల్ రావిపూడి ఇంతవరకూ సక్సెస్ లే కొట్టాడు.. దీంతో ఈసినిమాతో బాలకృష్ణ కు హ్యాట్రిక్ పక్కా అన్న అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. దానికి తగ్గట్టే అనిల్ కూడా బాలకృష్ణ కోసం సాలిడ్ కథను తయారుచేసినట్టు తెలుస్తుంది.

"లెజెండ్" @ 8 ఇయర్స్
బ్లాక్ బస్టర్ "సింహా " మూవీ తరువాత సక్సెస్ ఫుల్ బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “లెజెండ్ ” మూవీ 2014 మార్ఛి 28 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలు. ఒక కీలక పాత్రలో జగపతి బాబు నటించిన ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.