
ట్యాగ్ · 49 కథనాలు · పేజీ 3


మరో పవర్ ఫుల్ రోల్ లో బాలకృష్ణ?

మరోమారు బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్?
'లక్ష్మీస్ ఎన్టీఆర్' నటుడికి బాలకృష్ణ సాయం
బాలకృష్ణ, చిరంతన్... హ్యాట్రిక్ కొడతారా?
ఆ దర్శకుడికి మరో ఛాన్స్ ఇస్తున్న బాలకృష్ణ?

అక్టోబర్ 5 నుంచి NBK105 నెక్స్ట్ షెడ్యూల్?

`పింక్` తెలుగు రీమేక్‌లో బాలకృష్ణ?

కన్నడ చిత్రంలో గెస్ట్ రోల్‌లో బాలయ్య?

బాలయ్యతో ఆ ఇద్దరు.. నాలుగోసారి?
నటసింహ బాలకృష్ణ, యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. గతంలో ఈ ఇద్దరి కలయికలో వచ్చిన `సింహా`, `లెజెండ్` సంచలన విజయం సాధించాయి. కట్ చేస్తే.. సుదీర్ఘ విరామం అనంతరం ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ ఇరువురు జట్టుకట్టారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న సదరు చిత్రం... త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించుకోనుంది.

మరో పవర్ ఫుల్ రోల్ లో బాలకృష్ణ?
నటసింహ బాలకృష్ణ అంటేనే పవర్ ఫుల్ రోల్స్ కు కేరాఫ్ అడ్రస్. అలాంటి బాలయ్య.. త్వరలో మరో శక్తిమంతమైన పాత్రను ధరించనున్నారు. కెరీర్ లో ఇప్పటివరకు పోషించని `అఘోరా` పాత్రలో దర్శనమివ్వనున్నారట ఈ నందమూరి స్టార్.

మరోమారు బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్?
నటసింహ నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బి. గోపాల్ ది తెలుగునాట తిరుగులేని కాంబినేషన్ అనే చెప్పాలి. `లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్ పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు` వంటి బ్లాక్ బస్టర్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ జోడీ.. సుదీర్ఘ విరామం అనంతరం మరోమారు జట్టుకట్టనుంది. ఇప్పటికే ఈ కాంబినేషన్ మూవీకి ఓ పవర్ ఫుల్ సబ్జెక్ట్ రెడీ అయిందని, బోయపాటి శ్రీను కాంబినేషన్ ఫిల్మ్ తరువాత బాలకృష్ణ నటించే సినిమా ఇదే అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
'లక్ష్మీస్ ఎన్టీఆర్' నటుడికి బాలకృష్ణ సాయం
మరోసారి బాలకృష్ణ తన ఉదార స్వభావాన్ని చూపించారు.అది కూడా తమ కుటుంబంపై నెగిటివ్ గా ప్రచారం చేస్తూ తీసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' నటుడికి. అసలు సంగతేంటంటే.. ఈ సినిమాలో కీలక పాత్ర అయిన ఎన్టీఆర్ పాత్రలో ‘విజయ్‌కుమార్’ అనే స్టేజ్ ఆర్టిస్ట్ నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈయన భార్యకు ఇటీవల క్యాన్సర్ సోకింది. దాంతో విజయ్‌కుమార్ వైద్య ఖర్చులతో ఇబ్బంది పడుతున్నాడట.దీంతో బాలయ్య తన బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ లో ‘విజయ్‌కుమార్’ భార్యకు ఉచితంగా క్యాన్సర్ చికిత్సను అందిస్తున్నారట.
బాలకృష్ణ, చిరంతన్... హ్యాట్రిక్ కొడతారా?
నటసింహ నందమూరి బాలకృష్ణకి అచ్చొచ్చిన స్వరకర్తల్లో చిరంతన్ భట్ ఒకరు. బాలయ్య వందో చిత్రం `గౌతమీపుత్ర శాతకర్ణి`(2017)కి చిరంతన్ నే బాణీలు అందించాడు. హిస్టారికల్ డ్రామాగా రూపొందిన సదరు సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అనంతరం ఈ ఇద్దరి కలయికలో వచ్చిన `జై సింహా` (2018) కూడా విజయతీరాలకు చేరుకుంది.
ఆ దర్శకుడికి మరో ఛాన్స్ ఇస్తున్న బాలకృష్ణ?
`అధినాయకుడు` (2012)... నటసింహ బాలకృష్ణ కెరీర్ లో ప్రత్యేకంగా నిలచిన చిత్రం. ఇందులో మూడు తరాలకు చెందిన మూడు విభిన్న పాత్రల్లో నటించి అలరించాడు బాలయ్య. అలాగే త్రిపాత్రాభినయంలో తనదైన ముద్రవేశాడు. అలాంటి... `అధినాయకుడు`కి దర్శకత్వం వహించిన పరుచూరి మురళి డైరెక్షన్ లో బాలయ్య ఎనిమిదేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత మరో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు... వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముందని టాక్.

అక్టోబర్ 5 నుంచి NBK105 నెక్స్ట్ షెడ్యూల్?
‘జై సింహా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరు నిర్ణయించని ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో పవర్ ఫుల్ పోలీస్ అధికారి గానూ, గ్యాంగ్ స్టర్ గానూ... రెండు విభిన్న ఛాయలున్న పాత్రలో కనిపించనున్నాడు బాలయ్య. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో భూమికా చావ్లా, ప్రకాష్ రాజ్, జయసుధ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

`పింక్` తెలుగు రీమేక్‌లో బాలకృష్ణ?
`మంగమ్మగారి మనవడు`, `ముద్దుల మావయ్య`, `లక్ష్మీ నరసింహా`... ఇలా రీమేక్స్ లోనూ బ్లాక్‌బస్టర్స్ అందుకున్న ట్రాక్ రికార్డ్ నటసింహ నందమూరి బాలకృష్ణది. ఇంకా చెప్పాలంటే... ఒరిజినల్ వెర్షన్స్ కంటే మిన్నగా రీమేక్స్ హిట్ అయిన సందర్భాలు బాలయ్యకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో... ఈ నందమూరి హ్యాండ్సమ్ హీరో మరో రీమేక్‌లో నటించబోతున్నారంటూ టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.

కన్నడ చిత్రంలో గెస్ట్ రోల్‌లో బాలయ్య?
నటసింహ నందమూరి బాలకృష్ణ అతిథి పాత్రల్లో కనిపించిన సందర్భాలు అరుదనే చెప్పాలి. `త్రి మూర్తులు` (1987), `ఊ కొడతారా? ఉలిక్కి పడతారా?` (2012) చిత్రాల్లో ఆయన స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చారు. మళ్ళీ...చాన్నాళ్ళ తరువాత ఓ సినిమా కోసం గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారట బాలయ్య. అయితే... ఈ సారి తెలుగు చిత్రంలో కాదు.. ఓ కన్నడ చిత్రంలో నటించేందుకు ఈ నందమూరి అందగాడు సిద్ధమవుతున్నారట.