
ట్యాగ్ · 11 కథనాలు


హ్యాపీ బర్త్ డే.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్

బాహుబలి లేకపోతే పొన్నియిన్ సెల్వన్ లేదు-మణిరత్నం

"బాహుబలి "@ 7ఇయర్స్

మ్యాజిక్ క్రియేట్ చేసిన బాహుబలి కి 6 ఏళ్లు
ప్రభాస్ తో మరోసారి-రానా రియాక్షన్

5ఏళ్ల బాహుబలి.. ఎన్నో రికార్డులు ..!
తెలుగు సంచలనానికి 7ఏళ్లు..!

బాహుబలి ది ఎపిక్ ట్రైలర్ రిలీజ్
బాహుబలి & బాహుబలి 2 భారతీయ చలన చిత్ర చరిత్రలో ఒక స్వర్ణ అక్షరంలా చెప్పుకోవచ్చు. రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్ ను మార్చి తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన ఈ విజువల్ వండర్ విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా, ఇప్పుడు రెండు భాగాలను కలిపి 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నెల 31న ఈ చిత్రం థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో, మేకర్స్ విడుదల చేసిన కొత్త ట్రైలర్ అంచనాలను తారాస్థాయికి చేర్చింది.

బాహుబలి ది ఎపిక్ సెన్సార్ పూర్తి.. రిలీజ్‌కి రెడీ
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి ఫ్రాంఛైజీ (బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్) నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 'బాహుబలి: ది ఎపిక్' థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ప్రత్యేక ఎడిషన్ సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి.

హ్యాపీ బర్త్ డే.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్
ప్రభాస్.. ఈ ఒక్క పేరు బాక్సాఫీస్ తారకమంత్రమై పాన్ వరల్డ్ అంతటా మార్మోగుతోంది. టాలీవుడ్ లో హీరోలు పేరు తెచ్చుకోవడం చూస్తుంటాం కానీ టాలీవుడ్ కే పేరు తెచ్చిన స్టార్ హీరో ప్రభాస్. ఆయన నెంబర్ వన్ ఇండియన్ సూపర్ స్టార్ అని చెప్పేందుకు మాటలు కాదు ఆయన క్రియేట్ చేస్తున్న నెంబర్స్, రికార్డ్స్ తిరుగులేని నిదర్శనంగా నిలుస్తున్నాయి.

బాహుబలి లేకపోతే పొన్నియిన్ సెల్వన్ లేదు-మణిరత్నం
మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 మరో 4రోజుల్లో విడుదలకానుంది.ప్రస్తుతం ఈమూవీ టీం ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.పాన్ ఇండియా మూవీ కావడంతో తమిళ్ తోపాటు అన్ని భాషల్లో ఈసినిమాను ప్రమోట్ చేస్తున్నారు.అందులో భాగంగా నిన్న ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో దర్శకుడు మణిరత్నం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"బాహుబలి "@ 7ఇయర్స్
ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై రాజమౌళి ఎస్ ఎస్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రెండు భాగాలుగా రూపొందిన ఎపిక్ యాక్షన్ ఫిల్మ్ “బాహుబలి “ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రపంచవ్యాప్తంగా తెలుగు మూవీ సత్తాను చాటింది. ఈ మూవీ లో అనుష్క , తమన్నా , రమ్యకృష్ణ , రానా దగ్గుబాటి ముఖ్య పాత్రలలో నటించారు. భారీ సెట్టింగ్స్ , భారీ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను అలరించాయి. "బాహుబలి" ఫస్ట్ పార్ట్ "బాహుబలి :ది బిగినింగ్ " మూవీ 2015 జూలై 10 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 9000 ధియేటర్లలో విడుదల అయ్యి 650 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

టాలీవుడ్ పై అనన్య పాండే ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
ప్రస్తుతం టాలీవుడ్ సినిమా మార్కెట్ రేంజ్ పెరిగిపోయింది అని చెప్పొచ్చు. మన వాళ్లు భారీ బడ్జెట్ సినిమాలు తీయడానికి అస్సలు వెనుకాడటంలేదు. స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ నుండి సినిమా వస్తుందంటే చాలు పాన్ ఇండియా సినిమానే అవుతుంది. సినిమా హిట్ అయినా ఫట్ అయినా నిర్మాతలు కూడా ఏ మాత్రం రాజీ పడకుండా ధైర్యంగా సినిమాలు తీస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమాలను నార్త్ లో ఇప్పుడు ఆదరించినంత ఉండేది కాదు.. కానీ బాహుబలి తో తెలుగు సినిమా మార్కెట్ పూర్తిగా మారిపోయింది. ఆ తరువాత సాహో సినిమా.. ఇక గత రెండు మూడేళ్లలో ఎన్నో సినిమాలు.. ఇక రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమా తెలుగు సినిమా సత్తాను నార్త్ బాక్సాఫీస్ వద్ద…

మ్యాజిక్ క్రియేట్ చేసిన బాహుబలి కి 6 ఏళ్లు
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి1. బాహుబలి2 సిరీస్ ల గురించి కొత్తగా చెప్పేదేముంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్యపాత్రల్లో నటించిన బాహుబలి చిత్రం ఇండియన్ సినిమాగా టర్న్ తీసుకొని అందరి ప్రశంసలు అందుకుంది. తెలుగు సినిమా హద్దుల్ని చెరిపేసి.. మన తెలుగు సినిమా రేంజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా. దేశ వ్యాప్తంగా ఉన్న స్టార్ హీరోల కలెక్షన్లను వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్టానంలో నిలిచింది బాహుబలి సిరీస్.
ప్రభాస్ తో మరోసారి-రానా రియాక్షన్
బాహుబలి సినిమా అంటే మొదట మనకు గుర్తొచ్చేది బాహుబలి ప్రభాస్-భళ్లాలదేవ రానా. వారిద్దరూ లేకపోతే ఆ సిరీస్ లేనట్టే అని చెప్పొచు. ఇక ఈ సినిమాతో అటు ప్రభాస్, రానా కెరీర్ రేంజ్ ఏ కాదు.. తెలుగు సినిమా రేంజ్ కూడా పెరిగిపోయింది. ఇక ఈ కాంబినేషన్ లో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని కూడా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేస్తున్న 21 సినిమాలో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అందులో ఇప్పటివరకూ ఎలాంటి క్లారిటీ లేదనుకోండి..
"బాహుబలి ", "బాహుబలి 2" హిందీ వెర్షన్స్ రీ రిలీజ్
ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా ప్రధాన పాత్రలలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో 2 భాగాలుగా రూపొందిన "బాహుబలి " మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా ను చాటింది. "బాహుబలి -ది బిగినింగ్ " మూవీ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఇన్ ఇండియా , హిందీ భాషలో హైయెస్ట్ గ్రాసింగ్ డబ్బింగ్ మూవీ ఆఫ్ ఇండియా గా రికార్డ్ క్రియేట్ చేసింది.

5ఏళ్ల బాహుబలి.. ఎన్నో రికార్డులు ..!
తెలుగు సినీ చరిత్రలో బాహుబలి సిరీస్ ఒక కొత్త అధ్యయనాన్ని లిఖించిందని చెప్పడంలో సందేహం లేదు. రాజమౌళి ఎంతో జాగ్రత్తగా చెక్కిన శిల్పమే ఈ బాహుబలి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ,నాజర్, సత్యరాజ్ వంటి ప్రధాన పాత్రలతో రాజమౌళి తెరకెక్కించిన ’బాహుబలి’ భారతీయ సినీ చరిత్రలోనే గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సినిమా మొదటి పార్ట్ విడుదలై నేటితో 5 ఐదేళ్లు పూర్తి చేసుకుంది. భారీ సెట్టింగులు, అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్, ఆకట్టుకునే కథ, కథనాలు, రాజమౌళి మార్క్ టేకింగ్, సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ఈ సినిమా సక్సెస్ కు ప్రధాన కారణాలు.
తెలుగు సంచలనానికి 7ఏళ్లు..!
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి1. బాహుబలి2 సిరీస్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన తెలుగు సినిమా రేంజ్ ను భారీ స్థాయికి తీసుకెళ్లిన సినిమా. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించడమే కాకుండా.. ఇండియన్ హిస్టరీలోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. తెలుగు సినీ చరిత్రలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మొదటి సినిమా. అంతేకాదు ఇప్పుడు అంత దైర్యంగా.. అసలు ఏ మాత్రం వెనుకాడకుండా భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నారంటే.. దానికి ఓ రకంగా బాహుబలి సినిమా ఇచ్చిన ఇన్స్పిరేషనే కారణమని చెప్పొచ్చు. కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. పక్క రాష్ట్రాలు.. దేశాల్లో ఉన్న ప్రేక్షుకులను సైతం అలరించి హద్దుల్ని…