ట్యాగ్ · 127 కథనాలు · పేజీ 7

అనుపమకు "18 పేజెస్ " స్వాగతం

మలయాళ మూవీ తెలుగు రీమేక్ లో అనుపమ పరమేశ్వరన్ ?
"18 పేజెస్ " మూవీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ?
ఫిమేల్ సెంట్రిక్ మూవీ లో అనుపమ పరమేశ్వరన్
స్లిమ్ లుక్ లో అనుపమ పరమేశ్వరన్
సక్సెస్ ఫుల్ "ప్రేమమ్ "మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన అనుపమ సూపర్ హిట్ "అ ఆ" మూవీ తో టాలీవుడ్ లో అడుగు పెట్టి తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "ప్రేమమ్", "శతమానం భవతి ", హలో గురు ప్రేమకోసమే ", "రాక్షసుడు " వంటి సూపర్ హిట్ మూవీస్ తో అనుపమ తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. తమిళ మూవీస్ లో కూడా నటిస్తున్న అనుపమ ఒక మలయాళ మూవీలో హీరోయిన్ గా నటిస్తూ , అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.

అనుపమకు "18 పేజెస్ " స్వాగతం
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ "కుమారి21 F " మూవీ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "18 పేజెస్ " మూవీ రూపొందుతుంది. తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా ఎంపిక అయ్యారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.

మలయాళ మూవీ తెలుగు రీమేక్ లో అనుపమ పరమేశ్వరన్ ?
సూపర్ హిట్ "అ ఆ " మూవీ తో పరిచయం అయిన అనుపమ పరమేశ్వరన్ "ప్రేమమ్ ", "శతమానం భవతి ", "హలో గురు ప్రేమకోసమే ","రాక్షసుడు "వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మలయాళ , తమిళ , కన్నడ భాషల మూవీస్ లో నటిస్తున్న అనుపమ ఇప్పుడు వరుస తెలుగు మూవీస్ తో టాలీవుడ్ లో బిజీగా మారారు. నిఖిల్ హీరోగా రూపొందుతున్న "కార్తికేయ 2 ", "18 పేజెస్ " మూవీస్ లో హీరోయిన్ గా ఎంపిక అయిన అనుపమ ఇప్పుడు ఒక మలయాళ మూవీ తెలుగు రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
పబ్లిసిటీ అన్నారు.. అందుకే అక్కడ సినిమాలకు దూరంగా ఉన్నా..!
మలయాళం లో "ప్రేమమ్ " అందరికీ గుర్తుండిపోయే సినిమా అది. ఇక ఈ సినిమాతోనే వెండితెరకు పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్. తెలుగులో కూడా ప్రేమమ్ రీమేక్ తోనే పరిచయమైంది. ఇక ఆ తర్వాత సూపర్ హిట్ "అ ఆ " మూవీలో తన నటనతో ఆకట్టుకొని వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. పలు తెలుగు సినిమాల్లో నటించింది.
"18 పేజెస్ " మూవీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ?
యంగ్ హీరో నిఖిల్ "కార్తికేయ 2", "18 పేజెస్ " మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరో గా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ "కార్తికేయ "మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ కి సీక్వెల్ "కార్తికేయ 2 " మూవీ లో నిఖిల్ కు జోడీ గా అనుపమ పరమేశ్వరన్ ఎంపిక అయ్యారు.
ఫిమేల్ సెంట్రిక్ మూవీ లో అనుపమ పరమేశ్వరన్
తెలుగు, తమిళ, కన్నడ ,మలయాళ భాషా చిత్ర నటి, ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ నటించిన థ్రిల్లర్ మూవీ "రాక్షసుడు " ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అనుపమ ప్రస్తుతం సూపర్ హిట్ "నిన్నుకోరి " తమిళ రీమేక్ మూవీ, ఒక మలయాళ మూవీ లో నటిస్తున్నారు. అనుపమ ఇప్పుడు ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ లో అనుపమ పరమేశ్వరన్?
అందం, అభినయాల మేళవింపుగా నిలచిన కథానాయికల్లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. దక్షిణాదిన అన్ని భాషల సినిమాల్లోనూ నటించిన ఈ టాలెంటెడ్ బ్యూటీ... తెలుగునాట ఒక దశలో వరుస విజయాలు చూసింది. ఆ మధ్య కెరీర్ కాస్త ట్రాక్ తప్పినట్టు అనిపించినా.. `రాక్షసుడు`తో మళ్ళీ విజయపథంలోకి వచ్చేసింది.