
ట్యాగ్ · 67 కథనాలు · పేజీ 4


'అఖండ' హైలెట్ గా యాక్షన్ సీక్వెన్స్

"అఖండ"మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

"అఖండ"మూవీ షూటింగ్ పూర్తి

"అఖండ "మూవీ అప్ డేట్

'అఖండ' బర్త్ డే పోస్టర్ రిలీజ్

'అఖండ' నుండి బర్త్ డే అప్ డేట్

గోవా కు వెళ్లనున్న 'అఖండ'
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా అఖండ. ఈ సినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ ఇంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోలేకపోయింది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోగా ఇప్పుడు తాజాగా మరో షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక దసరా కానుకగా “అఖండ”ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. తాజా షెడ్యూల్ ను 'గోవా'లో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 13వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ షూటింగు మొదలుపెట్టనున్నారట. ప్రధాన పాత్రల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తారు. ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తవుతుందని అంటున్నారు…

'అఖండ' హైలెట్ గా యాక్షన్ సీక్వెన్స్
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా అఖండ. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ సినిమాలు రాగా ఇప్పుడు వస్తున్నది మూడో సినిమా కావడంతో ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక దసరా కానుకగా “అఖండ”ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది.

"అఖండ"మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. శ్రీకాంత్ , జగపతిబాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో బాలకృష్ణ నటిస్తున్న అఘోర పాత్ర, యాక్షన్ సీన్స్ “అఖండ “మూవీకి హైలైట్ కానున్నాయి.

"అఖండ"మూవీ షూటింగ్ పూర్తి
దర్శకుడు బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్ ” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ తెరకెక్కుతుంది . రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. శ్రీకాంత్ , జగపతిబాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో బాలకృష్ణ నటిస్తున్న అఘోర పాత్ర, యాక్షన్ సీన్స్ “అఖండ “మూవీకి హైలైట్ కానున్నాయి.

"అఖండ "మూవీ అప్ డేట్
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరో బాలకృష్ణ కథానాయకుడిగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ తెరకెక్కుతుంది . రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. శ్రీకాంత్ , జగపతిబాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో బాలకృష్ణ నటిస్తున్న అఘోర పాత్ర "అఖండ "మూవీకి హైలైట్ కానుంది. దర్శకుడు బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్ ” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

'అఖండ' బర్త్ డే పోస్టర్ రిలీజ్
‘సింహా’, ‘లెజెండ్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ విజయాల తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల మాసివ్ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’. ఇక ఇది మూడో సినిమా కావడంతో సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టైటిల్ రోర్ పేరుతో విడుదలైన ‘ అఖండ’ టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. కేవలం 16రోజుల్లోనే 50మిలియన్లకు పైగా వ్యూస్‌ని సాధించి టాలీవుడ్లో ఫాస్టెస్ట్ 50మిలియన్స్ వ్యూస్ సాధించిన టీజర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.

'అఖండ' నుండి బర్త్ డే అప్ డేట్
నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు ఈనెల 10న జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఇక పుట్టిన రోజు కు వచ్చే అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ కూడా అంతే ఆసక్తిగాఎదురుచూస్తున్నారు. అయితే బాలయ్య బర్త్ డే సెలబ్రేషన్ ముందుగానే స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం బాలయ్య మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాతో వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన సినిమా కరోనా వల్ల ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఇక ఇదిలా ఉండగా బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి అప్ డేట్ ను ఇచ్చేశారు చిత్రయూనిట్.