
ట్యాగ్ · 8 కథనాలు


హీరోగా మారడానికి ఆ సినిమాయే కారణం - అడివి శేష్

హిట్ 3 కోసం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

నెపోటిజం పై నాని సిస్టర్ ఎమోషనల్

1 మిలియన్ డాలర్ క్లబ్ లో హిట్ 2

ఎవరేమనుకున్నా నేను భారతీయుడిని - అడివి శేష్

అడివి శేష్ కొత్త ప్రాజెక్ట్ అప్ డేట్
వైవిధ్య కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. నటుడిగానే కాదు అటు రచయితగా కూడా తన టాలెంట్ ను చూపిస్తూ దూసుకుపోతున్నాడు. అందుకే వరుసగా హిట్లను అందుకుంటు కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది మేజర్, హిట్ 2 అంటూ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అడివి శేష్. రెండు సినిమాలు కూడా మంచి విజయాలు అందుకున్నాయి. రెండు సినిమాలు కూడా రెండు డిఫరెంట్ జోనర్లు. మేజర్ పేట్రియాటిజం నేపథ్యంలో అలానే హిట్ 2 సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాలు వచ్చాయి.

న్యూ ఇయర్ కానుకగా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానున్న HIT 2
హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో అడివి శేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో సూపర్ హిట్ HIT :ది ఫస్ట్ కేస్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ HIT – ది సెకండ్ కేస్ మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో ఘనవిజయం సాధించింది. హీరో అడివి శేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ఓ పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ గా HIT2 మూవీ ని తెరకెక్కించి డైరెక్టర్ శైలేష్ కొలను ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

హీరోగా మారడానికి ఆ సినిమాయే కారణం - అడివి శేష్
కెరీర్ ఆరంభంలో చిన్న, చిన్న రోల్స్ , అతిథి పాత్రల్లోనూ నటించిన అడివి శేష్ క్షణం మూవీ తో హీరోగా , రైటర్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. వరుస హిట్స్ తో అడివి శేష్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా రాణిస్తున్నారు. అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ అడివి శేష్ పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో అడివి శేష్ మాట్లాడుతూ .. తాను హీరోగా మారడానికి ఒక సినిమా కారణం అని చెప్పారు.

హీరోలు రవితేజ, అడివి శేష్ లపై మీనాక్షి చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఫెమీనా మిస్ ఇండియా హరియాణ 2018 టైటిల్ విన్నర్ మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనములు నిలుపరాదు మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. తరువాత మాస్ మహారాజా రవితేజ కు జంటగా మీనాక్షి ఖిలాడి మూవీలో నటించారు. అడివి శేష్, మీనాక్షి జంటగా తెరకెక్కిన HIT:ది సెకండ్ కేసు ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీతో మీనాక్షి ఫస్ట్ హిట్ అందుకున్నారు.

హిట్ 3 కోసం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్ల హవా నడుస్తుందని చెప్పొచ్చు. కొత్త కొత్త కథలతో హిట్లను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక అందులో శైలేష్ కొలను కూడా ఉన్నాడు. రీసెంట్ గానే హిట్ 2 తో మరో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా ఇంతకుముందు తన నుండి వచ్చిన హిట్ సినిమాకు సీక్వెల్. హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా.. సస్పెన్స్ థ్రిల్లర్ తో రూపొందించిన ఈసినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. ఆ సీక్వెల్ గా హిట్ 2 ను తెరకెక్కించి ఇటీవల రిలీజ్ చేశారు. అడివి శేష్ నటించిన ఈసినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఈసినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ అప్పుడే ఈసినిమాకు ఏడు ప్రాంచైజీస్ ఉన్నట్టు తెలిపాడు డైరెక్టర్. ఇక…

నెపోటిజం పై నాని సిస్టర్ ఎమోషనల్
అష్టా చమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన నటనతో న్యాచురల్ స్టార్ గా పేరుతెచ్చుకొని ఇప్పుడు స్టార్ హీరోగా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు నాని. ఇక ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క ప్రొడక్షన్ హౌస్ కూడా స్థాపించి నిర్మాతగా మారి సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే తన బ్యానర్ పై వచ్చిన హిట్ సినిమా హిట్ 2 సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. అంతేకాదు తన సిస్టర్ దీప్తిని కూడా డైరెక్టర్ గా తన ప్రొడక్షన్ హౌస్ నుండే ఇంట్రడ్యూస్ చేశాడు. మీట్ క్యూట్ అనే వెబ్ సిరీస్ ను దీప్తీ డైరెక్ట్ చేసింది దీప్తి. ఈ సిరీస్ కు నాని నిర్మాతగా వ్యవహరించాడు. ప్రస్తుతం అయితే ఈ సిరీస్ కు మంచి రెస్పాన్సే…

1 మిలియన్ డాలర్ క్లబ్ లో హిట్ 2
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో, వరుస హిట్లతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. కెరీర్ ప్రారంభం నుండీ విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. కథలో కంటెంట్ ఉండేలా చూసుకుంటాడు కాబట్టి వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. ఈనేపథ్యంలోనే ఈఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండు హిట్లను అందుకున్నాడు. పేట్రియాటిక్ నేపథ్యంలో వచ్చిన మేజర్ సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయి దేశవ్యాప్తంగా అడివి శేష్ కు గుర్తింపు నిచ్చింది. ఇక ఈనెల 2వ తేదీన రిలీజ్ అయిన సినిమా హిట్ 2. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా హిట్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే.

ఎవరేమనుకున్నా నేను భారతీయుడిని - అడివి శేష్
సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.