ట్యాగ్ · 7 కథనాలు

కాజల్ హాలీవుడ్ మూవీ టైటిల్ ది కాల్ సెంటర్ ?
కొరియన్ ఫిల్మ్ రీమేక్‌లో కాజల్?

కాజల్... స్పెషల్ డే

మార్చిలో కాజల్ డబుల్ ధమాకా?

`భారతీయుడు 2` చిత్రం కోసం కాజల్ న్యూ లుక్
కాజల్-గౌతమ్ కిచ్లూ.. వన్‌మంత్ యానివర్సిరీ
కాజల్ అగర్వాల్ పెళ్లి అక్టోబర్ 30న జరిగిన సంగతి తెలిసిందే. ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ కిచ్లూతో వివాహం జరిగింది. ముంబయిలోని ఓ హోటల్‌లో ఇరు కుటుంబసభ్యులు అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇక విహహం తర్వాత కాజల్ తన ఫొటోలు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది.ఇప్పుడు ప్రస్తుతం హనీమూన్ కోసం మాల్దీవ్స్ వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తుంది ఈ జంట. అక్కడికి వెళ్లిన దగ్గర నుండి రోజుకో ఫొటో అయినా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది ఈ భామ.

విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి హాలీవుడ్ ఎంట్రీ
జెఫ్రీ జీ చిన్ దర్శకత్వంలో మల్టీ మిలియన్ కాల్ సెంటర్ స్కామ్ నేపథ్యంలో టాలీవుడ్, హాలీవుడ్ నటులతో ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర, మహిమ ప్రధాన తారాగణంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో రూపొందుతుంది. ఈ మూవీ లో విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ అన్నాచెల్లెళ్ళు గా నటించడం విశేషం.

కాజల్ హాలీవుడ్ మూవీ టైటిల్ ది కాల్ సెంటర్ ?
టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ అగర్వాల్ ఒక హాలీవుడ్ మూవీ లో నటించనున్న విషయం తెలిసిందే జెఫ్రీ జీ చిన్ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా ఇంగ్లీష్ , తెలుగు భాషలలో రూపొందనున్న మూవీ కి టైటిల్ ది కాల్ సెంటర్ గా ఫిక్స్ చేసినట్టు సమాచారం. విష్ణు మంచు నిర్మాణ సారథ్యంలో రూపొందనున్న ఈ మూవీ తెలుగు వెర్షన్ లో విష్ణు మంచు హీరోగా నటిస్తారు. ఈ రొమాంటిక్ డ్రామా లో కాజల్ ఒక కొత్త లుక్ లో కనిపిస్తారని సమాచారం.
కొరియన్ ఫిల్మ్ రీమేక్‌లో కాజల్?
`నేనే రాజు నేనే మంత్రి`లో జోగేంద్ర, రాధగా అలరించిన రానా, కాజల్ అగర్వాల్... మరోసారి కలసి నటించేందుకు సిద్ధమవుతున్నారా? అవుననే వినిపిస్తోంది ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో.

కాజల్... స్పెషల్ డే
కాజల్ అగర్వాల్... ఈ భామ టాలీవుడ్‌కి చందమామ. కేవలం తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లోనూ నటిగా తనదైన ముద్ర వేసింది ఈ పంచదార బొమ్మ. 50కి పైగా సినిమాల్లో నటించి... కుర్రకారు మదిని దోచేసింది. అలాంటి కాజల్‌కి ఈ రోజు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే... సరిగ్గా ఇదే ఫిబ్రవరి 15న కాజల్ కథానాయికగా నటించిన మొదటి సినిమా `లక్ష్మీ కళ్యాణం` (2007) విడుదలైంది. తేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ఈ సినిమాతోనే కాజల్ హీరోయిన్‌గా తొలి అడుగులు వేసింది. పల్లెటూరి అమ్మాయి లక్ష్మిగా నటించి... తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత అదే ఏడాదిలో వచ్చిన కృష్ణవంశీ…

మార్చిలో కాజల్ డబుల్ ధమాకా?
దాదాపు పుష్కరకాలంగా కథానాయికగా రాణిస్తోంది అందాల తార కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిగా తనదైన శైలితో ముందుకు సాగుతున్న ఈ ముద్దుగుమ్మ... ఓ వైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే... మరో వైపు అభినయానికి ప్రాధాన్యమున్న చిత్రాల్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం కాజల్... `భారతీయుడు` సీక్వెల్‌తో పాటు `పారిస్ పారిస్` (తమిళ్), `సీత` చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా ఏస్ ఫిల్మ్ మేకర్ శంకర్ రూపొందిస్తున్న `భారతీయుడు` సీక్వెల్ ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళగా... `పారిస్ పారిస్`, `సీత` చిత్రీకరణ తుది దశలో ఉన్నాయి.

`భారతీయుడు 2` చిత్రం కోసం కాజల్ న్యూ లుక్
తెలుగు, తమిళ భాషల్లో పలు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించి... సంచలన విజయాలను అందుకుంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మరో మెగా బడ్జెట్ మూవీలో నటిస్తోంది. అదే... `భారతీయుడు 2`. లోక నాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా ఏస్ ఫిల్మ్ మేకర్ శంకర్ రూపొందించిన `భారతీయుడు` (1996)కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. హీరోయిన్‌గా నటించే బంపర్ ఆఫర్‌ను కొట్టేసింది కాజల్. అంతేకాదు... ఈ సినిమాలో రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనుందట. పాత్ర రీత్యా... పడుచు అమ్మాయిగానూ, వయసు మళ్ళిన స్త్రీగానూ కాజల్ కనిపించనుందట. `వయసు మళ్ళిన స్త్రీ`…