
ట్యాగ్ · 7 కథనాలు


కోబ్రా విక్రమ్ షాకింగ్ మేకోవర్

'విక్రమ్ 60'.. సగం షూటింగ్ పూర్తయింది
విక్రమ్ ఇంటికి బాంబు బెదిరింపులు
చియాన్ విక్రమ్ పై శ్రీనిధి శెట్టి ప్రశంసలు
యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్న విక్రమ్..!

'విక్రమ్' కు కరోనా పాజిటివ్..!
కరోనా ప్రభావం సినీ పరిశ్రమలో మళ్లీ పెరుగుతుంది. ఈమధ్య కరోనా ప్రభావం లేదు అని అనుకుంటుండగా మళ్లీ కేసులు మొదలవుతున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. ఇటీవల స్టార్ హీరో కమల్ హాసన్ కోవిడ్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా కరోనా బారిన పడ్డారు. ఆ హీరో ఎవరో కాదు తమిళ్ స్టార్ హీరో విక్రమ్. గత రెండు రోజులుగా హై ఫీవర్ తో భాదపడుతున్న విక్రమ్ కోవిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన క్వారంటైన్ ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన పనిలేదని చెబుతున్నారు. మరోవైపు కమల్ త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులతో పాటు ఆయన…

విక్రమ్ 60 వ మూవీ టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ ,ఆయన తనయుడు ధృవ్ విక్రమ్ హీరోలుగా మల్టి స్టారర్ గా" #VIKRAM60 " తమిళ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ పాత్ర నెగటివ్ షేడ్స్ లో, ధృవ్ క్యారక్టర్ పాజిటివ్ గా ఉంటుందనీ , ఇద్దరి పాత్రలు పోటాపోటీగా ఉంటాయనీ సమాచారం. ఈ మూవీ లో వాణి భోజన్ , సిమ్రాన్ , బాబీ సింహా , సనంత కీలక పాత్రలలో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

కోబ్రా విక్రమ్ షాకింగ్ మేకోవర్
విభిన్నమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ విక్రమ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు రెండు, మూడు గెటప్పుల్లో మాత్రమే అలరించిన విక్రమ్ ఇప్పుడు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఈసారి ఏకంగా 20కు పైగా గెటప్స్ తో వస్తున్నాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ 'కోబ్రా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కరోనా కారణం వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం పరిస్థితి మళ్లీ సాధారణం అవుతుండటంతో అతి త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించాలని భావిస్తున్నరట చిత్ర బృందం.

'విక్రమ్ 60'.. సగం షూటింగ్ పూర్తయింది
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలోతమిళ స్టార్ హీరో విక్రమ్ 60వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. విక్రమ్ తనయుడు ధృవ్ కూడా ఈసినిమాలో నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తెలుగులో కూడా విక్రమ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.. దీంతో తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ దశలో ఉండగా.. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది.
విక్రమ్ ఇంటికి బాంబు బెదిరింపులు
ఈ మధ్య ఏంటో తమిళ్ హీరోల ఇళ్లకు బాంబు బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. ఆ మధ్య సూపర్ స్టార్ రజినీకాంత్, ఇళయదళపతి విజయ్, అజిత్, సూర్య ఇంటిలో బాంబు పెట్టినట్టు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ధనుష్, విజయ్ కాంత్ ఇండ్లలో బాంబులు పెట్టినట్టు కూడా ఈ మధ్య కాలంలో వచ్చిన సంగతి కూడా గుర్తుండేవుంటుంది. ఇక ఇప్పుడు మరో హీరోకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ హీరో ఎవరో కాదు స్టార్ హీరో విక్రమ్.
చియాన్ విక్రమ్ పై శ్రీనిధి శెట్టి ప్రశంసలు
సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా సూపర్ నేచురల్ థ్రిల్లర్ "కోబ్రా " తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ "కె జి ఎఫ్ చాప్టర్ 1 "కన్నడ మూవీ ఫేమ్ శ్రీ నిధిశెట్టి కథానాయిక. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ , దర్శకుడు కె ఎస్ రవి కుమార్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్న విక్రమ్..!
యంగ్ హీరోలందరూ వర్కౌట్స్ చేస్తూ సిక్స్ ప్యాక్ తో అభిమానులను అలరిస్తున్నారు. ఒకరితో ఒకరు పోటీ పడి మరీ తమ లుక్స్ ను మార్చేసుకుంటున్నారు. యంగ్ హీరోల సంగతి ఓకే.. మరి సీనియర్ హీరోల సంగతేంటి. మేము కూడా వారికి ఏమాత్రం తక్కువ కాదంటున్నారు. మరి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విక్రమ్ ఫొటో చూస్తే ఎవరైనా ఆ మాట అనక తప్పదు. బ్లాక్ అండ్ వైట్ లో సిక్స్ ప్యాక్ లో ఉన్న విక్రమ్ ఫొటో చూస్తే ఈయన వయసు పెరుగుతుందా? లేక రోజు రోజుకు తగ్గుతుందా అన్న డౌట్ రాక మానదు. విక్రమ్ వయసు ఇప్పుడు 54 ఏళ్లు. కొడుకు ధృవ్ కూడా సినిమాల్లోకి వచ్చాడు. మొదటి సినిమాతో మంచి హిట్ కూడా కొట్టాడు. అలాంటి విక్రమ్ ఇప్పుడు ఈ వయసులో లుక్…