విక్రమ్ ఇంటికి బాంబు బెదిరింపులు

Actor Vikram, Actor Vikram Latest News, Actor Vikram Movie Latest Updates, Actor Vikram New Film Updates, Actor Vikram Recieves A Bomb Threat, Actor Vikram Recieves A Bomb Threat From An Anonymous Caller, Actor Vikram Upcoming Movie News, Bomb threat to Chiyaan Vikram, Bomb threat to Chiyaan Vikram Chennai residence, Chiyaan Vikram, Chiyaan Vikram receives bomb threat call, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates, Vikram Recieves A Bomb Threat, Vikram Recieves A Bomb Threat From An Anonymous Caller

ఈ మధ్య ఏంటో తమిళ్ హీరోల ఇళ్లకు బాంబు బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. ఆ మధ్య సూపర్ స్టార్ రజినీకాంత్, ఇళయదళపతి విజయ్, అజిత్, సూర్య ఇంటిలో బాంబు పెట్టినట్టు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ధనుష్, విజ‌య్ కాంత్ ఇండ్ల‌లో బాంబులు పెట్టిన‌ట్టు కూడా ఈ మధ్య కాలంలో వచ్చిన సంగతి కూడా గుర్తుండేవుంటుంది. ఇక ఇప్పుడు మరో హీరోకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ హీరో ఎవరో కాదు స్టార్ హీరో విక్రమ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా విక్ర‌మ్ నివాసానికి బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. సోమ‌వారం నాడు ఓ ఆగంత‌కుడు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి చెన్నైలోని హీరో విక్ర‌మ్ ఇంట్లో బాంబు పెట్టిన‌ట్లు బెదిరించారు. దీంతో పోలీసులు, బాంబ్‌స్క్వాడ్‌తో స‌హా హుటాహుటిన‌ ఆయ‌న ఇంటికి చేరుకుని సోదాలు నిర్వ‌హించారు. ఇక గతంలోలాగానే ఎవ‌రో ఆగంత‌కుడు బెదిరింపు కాల్స్ చేసినట్టు తెలిపారు. విల్లాపురం నుంచి కాల్ రావడంతో.. ప్ర‌స్తుతం పోలీసులు అత‌డిని ప‌ట్టుకునే ప‌నిలో ప‌డ్డారు.

ప్రస్తుతం అజయ్‌ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో కోబ్రా అనే చిత్రంలో నటిస్తున్నాడు విక్రమ్. ఈసారి ఏకంగా 20కు పైగా గెటప్స్ తో వస్తున్నాడు. ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూట్ కి బ్రేక్ పడింది. ఈ సినిమాతో పాటు తండ్రీకొడుకులు విక్రమ్‌, ధృవ్ ఒకే చిత్రంలో నటించనున్నట్టు తెలిసిందే కదా. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ పతాకంపై లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించబోతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + six =