కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

800 Movie

ట్యాగ్ · 7 కథనాలు

800 movie ott release date fixed
ఓటీటీ

800 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

శ్రీలంక స్పీన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ రియల్ స్టోరీ ఆధారంగా 800 అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే కదా. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో మధుర్ మిట్టల్ ప్రధాన పాత్రలో ఈసినిమా వచ్చింది. ఇక ఈమధ్యే ఈసినిమాను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈసినిమాకు అనుకున్నంత రెస్పాన్స్ ను రాలేదు. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమా వారు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోని తాజాగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. డిసెంబర్ 2వ తేదీన ఈసినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది.

TFN Adminవాట్సాప్
Muttiah Muralitharan's Biopic 800 Movie Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

మురళీధరన్ బయోపిక్ 800 రిలీజ్ డేట్ ఫిక్స్

టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘800’. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. కాగా ‘800’ ఆలిండియా పంపిణీ హక్కులను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నారు.

Srikanth Mవాట్సాప్
Sachin Tendulkar Unveils The Trailer of Muttiah Muralitharan's Biopic 800 Movie
ట్రైలర్ & టీజర్

సచిన్ చేతుల మీదుగా.. '800' మూవీ ట్రైలర్ విడుదల

టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా '800'. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. మురళీధరన్ పాత్రలో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. బుకర్ ప్రైజ్ (2022) పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ అందించారు. మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నరెన్, నాజర్, వేల్ రామమూర్తి, రిత్విక, వడివుక్కరసి, అరుల్ దాస్, హరి కృష్ణన్, శరత్ లోహితశ్వ తదితరులు నటించారు. ఇక ఈ చిత్రానికి ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ కాగా…

Srikanth Mవాట్సాప్
muttiah muralitharan biopic movie 800 first look poster release
ఫస్ట్ లుక్

ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

కొన్నాళ్లు బయోపిక్ ల హవా నడిచిన సంగతి తెలిసిందే కదా. ఎంతోమంది ప్రముఖుల బయోపిక్ లు తెరకెక్కాయి. ఈనేపథ్యంలో సెన్సేషనల్ శ్రీలంక క్రికెటర్, స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ కూడా వస్తుంది. ఈసినిమా 800 అనే టైటిల్ తో తెరకెక్కుతుంది. అంతర్జాతీయ క్రికెట్ కు రాకముందు మురళీధరన్ జీవితానికి సంబంధించిన సంఘటనలు.. క్రికెట్ ప్రియులకు, అతని అభిమానులకు ఎవరికీ తెలియని మురళీధరన్ జీవితాన్ని ఇందులోచూపిస్తారట. ఈసినిమాలో ముందుగా తమిళ్ టాలెంటెడ్ హీరో విజయ్ సేతుపతిని తీసుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల తాను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మధుర్ మిట్టల్ ముత్తయ్య మురళీధరన్ పాత్రలో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ముత్తయ్య మురళీధరన్ ' బయోపిక్ నుండి తప్పుకున్న విజయ్ సేతుపతి

మొత్తానికి విజయ్ సేతుపతి ముత్తయ్య మురళీధరన్ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది. సెన్సేషనల్ శ్రీలంక క్రికెటర్, స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ లో విజయ్ సేతుపతి నటిస్తున్నట్టు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.. అంతే కాదు మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో విజయ్ సేతుపతిని చూసి అచ్ఛం అలానే ఉన్నాడన్న ప్రశంసలు కూడా దక్కాయి. అయితే మరోపక్క ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్లో నటించవద్దంటూ నిరసనలు కూడా వెల్లువెత్తుతున్న సంగతి కూడా తెలిసిందే. శ్రీలంక మతవాదనకు మద్దతు పలికిన మురళీధరన్‌ నమ్మకద్రోహి అని కాబట్టి అతని బయోపిక్‌లో నటించవద్దంటూ పలు తమిళ సంఘాలు...భారతీరాజాతో సహా పలువురు కోలీవుడ్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

800 పై క్లారిటీ - ఈ సినిమాకు.. రాజకీయాలకు సంబంధం లేదు

శ్రీలంక స్పీన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ రియల్ స్టోరీ ఆధారంగా 800 అనే టైటిల్‌తో బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ బయోపిక్ లో విజయ్ సేతుపతి నటిస్తున్న సంగతి కూడా విదితమే. ప్రస్తుతం ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. మరోవైపు విజయ్ సేతుపతి కూడా బౌలింగ్ గురించిన మెళకువలు నేర్చుకుంటున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అందులో ముత్త‌య్య‌గా విజ‌య్ లుక్ చూసి ఒక రకంగా అందరూ షాకయ్యారు. ముత్త‌య్య మురళీధరన్ లుక్ ను దించేశాడు విజ‌య్‌

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ముత్తయ్య మురళీధరన్' బయోపిక్ కు టైటిల్ ఫిక్స్

సెన్సేషనల్ శ్రీలంక క్రికెటర్, స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ బయోపిక్ లో విజయ్ సేతుపతి నటిస్తున్నట్టు రీసెంట్ గా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కు రాకముందు మురళీధరన్ జీవితానికి సంబంధించిన సంఘటనలు.. క్రికెట్ ప్రియులకు, అతని అభిమానులకు ఎవరికీ తెలియని మురళీధరన్ జీవితాన్ని ఇందులోచూపిస్తారట. ప్రస్తుతం విజయ్ సేతుపతి ఆయన బౌలింగ్ శైలితోపాటు మ్యాన‌రిజ‌మ్స్‌ను ను కూడా నేర్చుకునే పనిలో పడినట్టు సమాచారం.

TFN Adminవాట్సాప్

షేర్