
ట్యాగ్ · 27 కథనాలు · పేజీ 2


"రౌడీ బాయ్స్" టీజర్ రిలీజ్

'పెళ్లి సందD' టీజర్ రిలీజ్

'క్లాప్' మూవీ టీజర్ రిలీజ్

'రాజా విక్రమార్క' టీజర్ రిలీజ్

వరుణ్ తేజ్ చేతుల మీదుగా 'రాజా విక్రమార్క' టీజర్

'వరుడు కావలెను' టీజర్ రిలీజ్

'అనుభవించు రాజా' టీజర్ రిలీజ్ చేయనున్న చరణ్
సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు "మూవీ ఫేమ్ శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ అనుభవించు రాజా. ఇక ఈసినిమా షూటింగ్ దాదాపు పూర్తికావస్తుండగా మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇక ఇటీవలే ఈసినిమా నుండి రాజ్ తరుణ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి టీజర్ రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ఈ సినిమా టీజర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

"రౌడీ బాయ్స్" టీజర్ రిలీజ్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "హుషారు" మూవీ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో యూత్ పుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ "రౌడీ బాయ్స్" మూవీ తెరకెక్కింది.

'పెళ్లి సందD' టీజర్ రిలీజ్
గౌరీ రోనంకి దర్శకత్వంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తున్న సినిమా 'పెళ్లి సందD'. పాత సినిమా పెళ్లిసందడిలో శ్రీకాంత్ నటించగా ఇప్పుడు ఈ మోడ్రన్ పెళ్లి సందD తో రోషన్ సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలను రిలీజ్ చేయగా అవి బాగానే ఆకట్టుకున్నాయి. నేడు తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక టీజర్ ను బట్టి ఇందులో రోషన్ బాస్కెట్ బాల్ ప్లేయర్‌గా మనకు కనిపిస్తున్నాడు. అంతేకాదు రోషన్ యాక్షన్, డ్యాన్స్ అన్నీ టీజర్ లో చూపించారు. మొత్తానికి టీజర్ అయితే ఆకట్టుకునేలాగే…

'క్లాప్' మూవీ టీజర్ రిలీజ్
ఆది పినిశెట్టి గురించి.. తన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటినుండి విభిన్నమైన కథలు .. విలక్షణమైన పాత్రలను చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక వైపున హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు పాత్ర ప్రధానమైన సినిమాలు అప్పుడప్పుడు విలన్ పాత్రలు కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అందుకే తమిళ్ తో పాటు తెలుగులో తన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తాజాగా `క్లాప్` అనే మరో సినిమాతో వస్తున్నాడు.

'రాజా విక్రమార్క' టీజర్ రిలీజ్
ఆర్ఎక్స్ 100 తో తెలుగు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ మొదటి సినిమాతోనే నటుడిగా తనేంటో నిరూపించుకున్నాడు. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ లో బిజీ అయిపోయాడు. హీరోగానే కాదు విలన్ గా కూాడా చేసి మెప్పించాడు. ప్రస్తుతం కార్తికేయ శ్రీ సరిపల్లి అనే డైరెక్టర్ రాజా విక్రమార్క అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కార్తికేయ ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈసినిమా రీసెంట్ గానే షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.

వరుణ్ తేజ్ చేతుల మీదుగా 'రాజా విక్రమార్క' టీజర్
టాలీవుడ్ యంగ్ హీరో విభిన్నమైన కథలతో.. వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకు వెళుతున్నాడు కార్తికేయ. ఇక ఈ ఏడాదే చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ ఇప్పుడు రాజా విక్రమార్క సినిమాతో వచ్చేస్తున్నాడు. శ్రీ సరిపల్లి అనే కొత్త దర్శకుడితో కార్తికేయ రాజా విక్రమార్క సినిమా చేస్తున్నాడు. ఇక ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్.

'వరుడు కావలెను' టీజర్ రిలీజ్
థియేటర్లు ఓపెన్ అవ్వడంతో హీరోలు తమ సినిమాలను వీలైనంత త్వరగా రిలీజ్ చేసుకోడానికి ట్రై చేస్తున్నారు. అందుకే పెండింగ్ లో ఉన్న సినిమాల షూటింగ్ లను చకచకా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగానే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేస్తున్నారు. ఇక నాగశౌర్య కూడా అదే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం నాగశౌర్య చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. వాటిలో వరుడు కావలెను సినిమా కూడా ఉంది. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసింది. ఇక ఈగ్యాప్ లో మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనిలో…