సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. అల్లు అర్జున్ ఫుల్ డీ గ్లామరైజ్డ్ గా రా అండ్ రస్టిక్ మేకోవర్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈసినిమాకు సెకండ్ పార్ట్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటివరకూ కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఈమధ్య షూట్ కు బ్రేక్ పడింది. గత కొద్దిరోజులు గా మైత్రీమూవీ మేకర్స్ ఆఫీసుల్లో ఐటీ దాడులు నిర్వహించడంతో షూట్ కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో మళ్లీ షూటింగ్ సందడి మొదలైంది. ప్రస్తుతం మారేడుమిల్లి ఫారెస్ట్ ఏరియాలో కొత్త షెడ్యూల్ ను ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లో ఫహాద్ ఫాజిల్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. అనంతరం ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులో ఉన్న ఫారెస్ట్ ఏరియాలో మరో కీలక షెడ్యూల్ ప్లాన్ చేశాడట సుకుమార్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది. జగపతిబాబు కూడా ఓకీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈసినిమా నుండి ఒక వీడియోను రిలీజ్ చేయగా దానికి వచ్చిన రెస్పాన్స్ బట్టి చెప్పొచ్చు. ఈసెకండ్ పార్ట్ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారు. ఆ వీడియోతో పుష్ప గాడి రూల్ మొదలైందని మరోసారి నిరూపించారు. మరి పార్ట్ 2 తో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























