న్యాచురల్ స్టార్ నాని కూడా గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తన నుండి నేడు రిలీజ్ అవుతున్న సినిమా దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సింగరేణి గోదావరిఖని గనుల నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది ఈసినిమా. ఈ సినిమాలో ఫుల్ రఫ్ అండ్ రస్టిక్ పాత్రలో నటిస్తున్నాడు నాని. ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తరువాత నాని తన 30వ సినిమా చేయనున్న సంగతి ఇంకా ఈసినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.. తెలిసిందే. ఇప్పటికే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు కూడా. దసరా సినిమా రిలీజ్ ఉండటంతో ఆసినిమా ప్రమోషన్స్ వల్ల ఈసినిమాను మొదలుపెట్టలేదు ఇంకా. అయితే ఈసినిమాలో తన రోల్ గురించి చెప్పేశాడు నాని. నాని30 సినిమాలో నా రోల్ దసరా సినిమాలో రోల్ కు పూర్తి భిన్నంగా ఉంటుంది.. 6 ఏళ్ల కూతురికి ఫాదర్ గా చేస్తున్నా.. నా క్యారెక్టర్ చాలా కొత్తగాఉంటుంది అని తెలిపాడు.
ఇక ఈసినిమాలో సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా..హృదయం ఫేమ్‌కు చెందిన ప్రముఖ మలయాళ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈసినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సి.వి.మోహన్, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: