టాలీవుడ్ యంగ్ కిరణ్ అబ్బవరం మొత్తానికి డీసెంట్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. గత ఏడాది రెండు సినిమాలతో వచ్చాడు. సమ్మతమే ఇంకా నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాల రాగా అవి అంత విజయాన్ని అందించలేకపోయాయి. రీసెంట్ గా వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కామెడీ ప్లస్ థ్రిలింగ్ కథాంశంతో వచ్చిన ఈసినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అంతేకాదు మంచి ఓపెనింగ్స్ ను సైతం అందుకుంది. ఈసినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇక ఈసినిమా రిలీజ్ అయిపోయి పదిరోజులు అయిపోయింది. పది రోజుల్లో ఈసినిమా 11 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకొని నిర్మాతలకు మంచి లాభాలనే అందించింది. ఈసినిమా తాజా కలెక్షన్స్ పోస్టర్ ను చిత్రయూనిట్ పోస్ట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో కశ్మీర హీరోయిన్ గా నటించింది. ఇంకా మురళీ శర్మ, ప్రవీణ్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో ఈసినిమాను నిర్మించారు. అలాగే చైతన్ భరద్వాజ్ సంగీతం, సినిమాటోగ్రఫీ విశ్వాస్ డేనియల్ అందించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























