ముద్రాస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్లపై రమణన్ పురుషోత్తమ దర్శకత్వంలో జాతీయ అవార్డు గ్రహీత, విలక్షణ నటుడు బాబీ సింహా , కశ్మీర పరదేశి జంటగా తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ వసంత ముల్లై తమిళ మూవీ ఫిబ్రవరి 10 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు , కన్నడ వెర్షన్స్ వసంతకోకిలా టైటిల్ తో 10 వ తేదీ రిలీజ్ కానున్నాయి.నలభై ఏళ్ల క్రితం కమల్ హాసన్, శ్రీదేవి నటించిన సూపర్ హిట్ వసంతకోకిల`టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కడం విశేషం. ఇప్పటికేచిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, సాంగ్స్ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వసంత కోకిల మూవీ ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. ట్రైలర్ రిలీజ్ చేసిన చిరంజీవి, దానిని గురించి స్పందించారు. ఈ ట్రైలర్ చాలా థ్రిల్లింగ్ గా అనిపించిందనీ , . సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోందనీ , వసంత కోకిల మూవీ కథ .. ఒకరాత్రి జరిగే సంఘటనలతో నడుస్తుందనీ , . ఆర్య కూడా ఈ సినిమాలో ఒక ప్రధానమైన పాత్రను పోషించారనీ , బాబీ సింహ , ఆర్య కాంబినేషన్లో ఈ సినిమా రాబోతోందనీ , తప్పకుండా మీరంతా ఆశిస్తున్న వినోదాన్ని ఈ సినిమా పంచుతుందనీ , పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాననీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























