తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో NBK108

Anil Ravipudi Revealed The Backdrop of NBK 108,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,NBK 108,NBK 108 Latest News,NBK 108 Movie,NBK 108 Telugu Movie,Anil Ravipudi,Anil Ravipudi Latest News,Anil Ravipudi News,Anil Ravipudi About NBK 108,Anil Ravipudi Comments On NBK 108

టాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకుపోతున్న డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి ఇప్పటి వరకూ పరాజయం లేకుండా వరుస విజయాలనే సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు తన తరువాత సినిమా నటసింహం బాలకృష్ణతో చేయనున్న సంగతి తెలిసిందే కదా. నిజానికి అనిల్ రావిపూడి ఇప్పటివరకూ తన మార్క్ కామెడీతోనే సినిమా చేస్తూ హిట్లను సొంతం చేసుకున్నాడు. కానీ బాలకృష్ణ కామెడీ యాంటర్ టైనర్ లు చేసింది. ఈకారణంతో అనిల్ రావిపూడి బాలకృష్ణ కోసం ఎలాంటి కథను సిద్దం చేశాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసినిమాకు తన మార్క్ కామెడీని యాడ్ చేస్తూనే మరోవైపు పవర్ ఫుల్ కథను అనిల్ సిద్దం చేసినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా ను ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇక ఇన్ని రోజులు బాలకృష్ణ వీరసింహారెడ్డి బిజీగా ఉన్నాడు. ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈసినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వస్తుంది. ఈసినిమా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నాడట. అంతేకాదు బాలయ్య పాత్ర ఒకపక్క పవర్ ఫుల్ గా ఉంటూనే.. మరోవైపు ఆపాత్ర యాక్టివిటీస్ వెరీ ఫన్నీగా సాగుతాయట. అలాగే సినిమాలో ఫాదర్, కూతురు మధ్య ఓ ఎమోషనల్ ట్రాక్ కూడా ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటుందని తెలుస్తోంది. చూద్దాం మరి అనిల్ రావిపూడి బాలకృష్ణ ను ఎలా చూపించబోతున్నాడో..

కాగా ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇక ఈసినిమాలో బాలకృష్ణ కుమార్తెగా శ్రీలీల అలరించనుందంట. ప్రియాంక్ జవాల్కర్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి కూడా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.