బ్రేక్ ఈవెన్ కు చేరువలో వీరసింహారెడ్డి

Veera Simha Reddy 11 Days Collections Worldwide

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వీరసింహారెడ్డి మూవీలో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బాలకృష్ణ ఈ మూవీకి హైలైట్ గా నిలిచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యూఎస్ లో వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన వీర సింహారెడ్డి ఫస్ట్ వీకెండ్ లో ప్రాఫిట్ జోన్ లో ఎంటర్ అయ్యింది. వీరసింహారెడ్డి మూవీ బ్రేక్ ఈవెన్ కు చేరువలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పదిరోజుల్లో ఈ మూవీ రూ. 72.24కోట్లు షేర్ (రూ. 121.05 కోట్లు గ్రాస్) వసూళ్లు సాధించింది. 74 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ  బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 1.76 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంది. ఇక అది కూడా త్వరలో కంప్లీట్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 8 =