ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీ మంచి శకునంతోనే మొదలైంది. సంక్రాంతికి ఇద్దరి అగ్రహీరోలు బాక్సాఫీస్ బరిలో పోటీకి దిగారు. నిన్న బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ అయింది. నేడు చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీరసింహా రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. తనకు అచ్చొచ్చిన ఫ్యాక్షన్ సినిమాలో మరోసారి బాలకృష్ణ చెలరేగిపోయాడు. బాలకృష్ణ నటన, యాక్షన్ సీక్వెన్స్, పాటలు ఇలా అన్నీ సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. ఇక ఈసినిమా కలెక్షన్స్ లో దూసుకుపోతుంది. రిలీజ్ అయిన ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయి కలెక్షన్స్ ను అందుకుంది. ఈ సినిమా మొదటి రోజు 54 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాలకృష్ణ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను అందించింది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ కూడా తెలుపుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటించింది. ఇంకా దునియా విజయ్, మంజువారియర్, హనీ రోజ్, ఈశ్వరీరావు, నవీన్ చంద్ర, అన్నపూర్ణమ్మ, బ్రహ్మానందం, అలీ, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈసినిమా మైత్రీ మూవీ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మించారు. ఈసినిమాకు థమన్ సంగీతం, రిషి పంజాబీ సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: