ఫిబ్రవరి 17 వ తేదీ 4 సినిమాల సందడి

4 Telugu Movies To Release On 17th February 2023,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies,Latest Telugu Movies 2023,2023 Latest Telugu Movies,Telugu Movies 2023,2023 Telugu Movies,New Telugu Movies 2023,2023 New Telugu Movies,4 Telugu Movies To Release On 17th February,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Telugu Movie,Shaakuntalam Update,Shaakuntalam Updates,Shaakuntalam Movie Updates,Shaakuntalam Movie Update,Shaakuntalam Movie Latest Updates,Shaakuntalam Movie Latest Update,Samantha Shaakuntalam,Samantha Shaakuntalam Movie,Samantha,Samantha Movies,Samantha New Movie,Samantha Latest Movie,Samantha Upcoming Movie,Samantha New Movie Update,Samantha Latest Movie Update,Sir,Sir Movie,Sir Telugu Movie,Sir Update,Sir Updates,Sir Movie Updates,Sir Movie Update,Sir Movie Release Date,Dhanush,Dhamki,Dhamki Movie,Dhamki Telugu Movie,Dhamki Update,Dhamki Updates,Dhamki Movie Updates,Dhamki Movie Update,Dhamki Movie Release Date,Vishwak Sen,Vinaro Bhagyamu Vishnu Katha,Vinaro Bhagyamu Vishnu Katha Movie,Vinaro Bhagyamu Vishnu Katha Telugu Movie,Vinaro Bhagyamu Vishnu Katha Movie Update,Vinaro Bhagyamu Vishnu Katha Movie Release Date,Kiran Abbavaram,Kiran Abbavaram Movie

2023 సంక్రాంతి పండగ కి పలు సినిమాల సందడి ఉన్నట్టే ఫిబ్రవరి 17 వ తేదీ 4 సినిమాలు సందడి చేయనున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శాకుంతలం :దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ భారీ బడ్జెట్, భారీ సెట్స్ తో తెరకెక్కిన శాకుంతలం మూవీ 2023 ఫిబ్రవరి 17 వ తేదీన రిలీజ్ కానుంది. ఈ మూవీలో అదితి బాలన్, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, కబీర్ దుహన్ సింగ్, అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సమంత ఫస్ట్ టైమ్ నటించిన ఈ మైథలాజికల్ మూవీ శాకుంతలం 3D ఫార్మాట్ లో పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది.

ధమ్కీ :రీసెంట్ గా సక్సెస్ ఫుల్ ఓరి దేవుడా .. ! మూవీ తో ప్రేక్షకులను అలరించిన హీరో విశ్వక్ సేన్ ఇప్పుడు ఒక కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్స్ పై యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, నివేత పేతురాజ్ జంటగా రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ధమ్కీ మూవీ 2023 ఫిబ్రవరి 17 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ పాన్ ఇండియా మూవీలో రావు రమేష్‌, హైపర్‌ ఆది, రోహిణి, పృథ్వీరాజ్‌ ముఖ్య పాత్రలలో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

సార్ : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్‌దే మూవీస్ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన సార్ మూవీ ఫిబ్రవరి 17 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సాయి కుమార్, తనికెళ్ళ భరణి ముఖ్యపాత్రలలో నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, మాస్టారు మాస్టారు సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మాస్టారు మాస్టారు సాంగ్ తెలుగు, తమిళ రెండు భాషల్లోనూ సూపర్ హిట్ అయింది.

వినరో భాగ్యము విష్ణు కథ :అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా తెరకెక్కిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ఫిబ్రవరి 17వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీతో పాటు కిరణ్ అబ్బవరం హీరోగా పలు మూవీస్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.