అష్టా చమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన నటనతో న్యాచురల్ స్టార్ గా పేరుతెచ్చుకొని ఇప్పుడు స్టార్ హీరోగా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు నాని. ఇక ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క ప్రొడక్షన్ హౌస్ కూడా స్థాపించి నిర్మాతగా మారి సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే తన బ్యానర్ పై వచ్చిన హిట్ సినిమా హిట్ 2 సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. అంతేకాదు తన సిస్టర్ దీప్తిని కూడా డైరెక్టర్ గా తన ప్రొడక్షన్ హౌస్ నుండే ఇంట్రడ్యూస్ చేశాడు. మీట్ క్యూట్ అనే వెబ్ సిరీస్ ను దీప్తీ డైరెక్ట్ చేసింది దీప్తి. ఈ సిరీస్ కు నాని నిర్మాతగా వ్యవహరించాడు. ప్రస్తుతం అయితే ఈ సిరీస్ కు మంచి రెస్పాన్సే వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు దీప్తి తన మీట్ క్యూట్ పై అలానే నెపోటిజంపై స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేస్తుంది. నాని సోదరి కావడం వల్లే డైరెక్టర్ ఈజీగా అయిందని.. నాని కూడా నెపోటిజంని సపోర్ట్ చేస్తున్నాడు, నాని లేకపోతే ఈమెకి ఛాన్స్ వచ్చేది కాదు అని కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది. దీంతో వీటిపై దీప్తి సమాధానమిస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. చాలా మంది నన్ను నెపోటిజం అని, నాని ఉన్నాడు కాబట్టే నేను దర్శకురాలిని అయ్యానని అంటున్నారు. నేను కథలు రాస్తాను. అలాగే ఈ కథ కూడా రాశాను. నానికి నచ్చి తానే ఎంకరేజ్ చేసి పూర్తి కథ సిద్ధం చేయించాడు నాతో. తానే నిర్మాత అవుతానని చెప్పాడు. నేను అడగలేదు. డైరెక్టర్ గా కూడా మారమని ప్రోత్సహించి సపోర్ట్ చేశాడు. అవును నా నాని వల్లే నేను డైరెక్టర్ అయ్యాను. ఇందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సిరీస్ బయటకి రావడానికి కూడా కారణం నానినే. మీట్ క్యూట్ కి మంచి స్పందన వచ్చాక నాకంటే నానినే ఎక్కువ సంతోషంగా ఫీల్ అయ్యాడు” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























