ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ మూవీ 2021 డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ వసూళ్ళు సాధించింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. బాలకృష్ణ, ప్రగ్య జైస్వాల్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. సంగీత దర్శకుడు థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అఖండ మూవీ సుమారు 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. 94 కోట్ల కు పైగా షేర్ సాధించి డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలను అందించింది. 2022 జనవరి 21న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ మూవీ డిజిటల్ వేదికలోనూ రికార్డును క్రియేట్ చేసింది. హీరో బాలకృష్ణ సినీ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన అఖండ మూవీ నేటితో వన్ ఇయర్ దిగ్విజయం గా పూర్తి చేసుకుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న వీర సింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































