అలనాటి నటుడు సూపర్ స్టార్ కృష్ణ నేడు తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో నేడు మరణించారు. దీంతో మహేష్ కుటుంబం ఒక్కసారిగా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇక ఇప్పటికే కృష్ణ మృతిపట్ల సినీ రాజకీయ ప్రముఖుల దగ్గర నుండి అందరూ సంతాపం తెలియచేస్తున్నారు. ఇక తాజాగా ప్రధానమంత్రి మోడీ కూడా తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సంతాపం తెలియచేశారు. కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో,ఉన్నతమైన,స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్.ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.ఈ విషాదకర సమయంలో మహేష్ బాబుకు అలానే వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో,ఉన్నతమైన,స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్.ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.ఈ విషాదకర సమయంలో @urstrulyMahesh, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.
— Narendra Modi (@narendramodi) November 15, 2022
కాగా తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన సాహసాలు అన్నీ ఇన్నీ కావు. ఆ రోజుల్లోనే టెక్నాలజీని పరిచయం చేసిన ఏకైక హీరో కృష్ణ. మొదటగా పలు నాటకల్లో నటించిన ఆయన ఆ తరువాత పలు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించారు. ఇక తేనెమనసులు సినిమాతో నటుడిగా అందరి ప్రశంసలందుకున్నారు కృష్ణ. తొలి చిత్రం సాధించిన విజయంతో కృష్ణ వెను దిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది ఇక తన సినీ ప్రయాణంలో 350 పైగా చిత్రాల్లో ఎన్నో సాంఘిక, జానపద, పౌరాణిక,జేమ్స్‌బాండ్, కౌబాయ్ వంటి డిఫరెంట్ చిత్రాల్లో మెప్పించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























