ఈమధ్య హీరోలే కాదు హీరోయిన్లు కూడా తన సినిమాల ఎంపికలో రూట్లు మార్చుతున్నారు. హీరోలు మాదిరిగానే హీరోయిన్లు కూడా లేడీ ప్రాధాన్యత సినిమాలు చేయడానికి ముందుకువస్తున్నారు. స్క్రిప్ట్ లను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నారు. ఇక అలాంటి హీరోయిన్లతో ఫస్ట్ వరుసలో ఉండే పేరు సమంత. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ దశాబ్దానికి పైగా కెరీర్ ను సాగించింది.. ఇన్నేళ్లలో ఎన్నో పాత్ర ప్రధానమైన సినిమాలు అలానే గ్లామర్ పాత్రలు కూడా చేసింది. అయితే ఇప్పుడు మాత్రం తన స్క్రిప్ట్ విషయంలో ఎంతో మారిపోయింది. తనకంటూ ప్రత్యేక పాత్రలు ఉంటేనో.. లేదంటే కథ, కథనాలు కొత్తగా ఉంటేనో సినిమాలు చేస్తోంది. లేడీ సెంట్రిక్ మూవీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం తెలుగులో పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో యశోద సినిమా కూడా ఒకటి. హరి, హరీష్ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా వస్తున్న సినిమా యశోద. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక దానికి తోడు ఈసినిమా రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ ను బట్టి సర్రోగసీ స్కామ్ నేపథ్యంలో ఈ సినిమా వస్తున్నట్టు అర్థమవుతుంది. ఇందులో సమంత యాక్షన్ సీక్వెన్స్‌లు, సమంత నటన, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా అన్నీ కూడా అకట్టుకుంటున్నాయి.
ఇదిలా ఉండగా ఈట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ పై స్పందిస్తూ సామ్ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. యశోద ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా ఉంది. జీవితం ఎన్నో సవాళ్లను నా ముందు ఉంచింది. మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత ధైర్యాన్ని, సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. గత కొన్ని నెలల నుండి నేను మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూనిటీ కండీషన్ కు చికిత్స తీసుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే నేను కోలుకుంటున్నాను.. అయితే అనుకున్న దానికంటే కాస్త ఎక్కువ టైమే పడుతుంది. త్వరలోనే దీనినుండి పూర్తిగా కోలుకుంటానని నమ్మకం ఉంది.. నా జీవితంలో మానసికంగా, శారీరకంగా మంచి రోజులు, చెడు రోజులు అన్నీ చూశాను.. ఎలాగో అలాంటి రోజులు గడిచిపోయాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది ఐ లవ్ యూ అంటూ పోస్ట్ చేసింది.
— Samantha (@Samanthaprabhu2) October 29, 2022
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























