ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలానికే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. ఇక ఇటీవలే కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన టాక్ తెచ్చుకోలేకపోయింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో విలేజ్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు పోస్టర్లు, గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. నిజానికి ఈసినిమా ఈ ఏడాదే రిలీజ్ అవుతుందని అనుకున్నారు కానీ వచ్చే ఏడాదికి వెళ్లింది. ఈసినిమా వచ్చే ఏడాది శివరాత్రి సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
#VinaroBhagyamuVishnuKatha Worldwide Grand Release in theatres on 𝐅𝐄𝐁 𝟏𝟕th, 2023.
Meet our #Vishnu this Shivaratri! ⚡#AlluAravind #BunnyVas @Kiran_Abbavaram@kashmira_9 @KishoreAbburu @chaitanmusic #MarthandaKVenkatesh @daniel_viswas @imsarathchandra @GA2Official pic.twitter.com/uEsD4MHzhY
— Geetha Arts (@GeethaArts) October 29, 2022
కాగా ఈసినిమాలో కశ్మీర హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో ఈసినిమాను నిర్మిస్తున్నారు. అలాగే చైతన్ భరద్వాజ్ సంగీతం, సినిమాటోగ్రఫీ విశ్వాస్ డేనియల్ అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























