యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సీనియర్ హీరోలు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. 60, 70 పదుల వయసులో కూడా.. వయసును సైతం పక్కనపెట్టి తమ అభిమానులను అలానే సినీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోతున్నారు. అందులో తమిళ్ స్టార్ హీరో రజనీకాంత్ కూడా ఉన్నారు. రజనీకాంత్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ఒక సినిమా అయిపోయిన వెంటనే మరో సినిమాను లైన్ లో పెట్టేస్తున్నారు. ప్రస్తుతం జైలర్ సినిమాతో వచ్చేస్తున్నారు రజనీకాంత్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా సెట్స్ పైన ఉండగానే మరో రెండు భారీ సినిమాలకు రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ రెండు ప్రాజెక్టులు కూడా లైకా బ్యానర్లో వస్తున్నట్టు సమాచారం. గతంలో ఇదే బ్యానర్ పై రజనీ కాంత్ రోబో 2.0.. ‘దర్బార్’ సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా హిట్ అవ్వడంతో అప్పుడు మరో రెండు సినిమాలు చేయడానికి రజనీ ఓకే చెప్పారని అంటున్నారు. వీటిలో ఒక సినిమాకి ‘డాన్’తో హిట్ అందుకున్న శిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్నాడట. ‘కనులు కనులను దోచాయంటే’ డైరెక్టర్ దేశింగు పెరియస్వామి మరో సినిమాకి దర్శకత్వం వహించనున్నాడట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























