మాస్ మహారాజా రవితేజ హీరోగా ధమాకా ! , రావణాసుర , టైగర్ నాగేశ్వర రావు మూవీస్ సెట్స్ పై ఉన్నాయి . ఈ మూవీస్ తో పాటు రవితేజ , మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న MEGA 154 మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ జింతాక్ , గ్లింప్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీపావళి సందర్భంగా ఈనెల 21న ధమాకా క్రాకర్ పేరుతో టీజర్ రిలీజ్ కానుంది. మాస్ మహారాజా రవితేజ మరో సరికొత్త అవతారం ఇదనీ , ఈసారి డబుల్ ఇంపాక్ట్ చూపిస్తారనీ , ఇప్పటికే విడుదల చేసిన పాటలకు, ప్రచార చిత్రాలకు మంచి పేరు వస్తోందనీ , భీమ్స్ అందించిన బాణీలు హుషారుగా సాగిపోతాయనీ , త్వరలోనే విడుదల తేదీ కూడా ప్రకటిస్తామనీ నిర్మాత తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























