టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ అయోధ్యలో ఆదిపురుష్ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో , రాధేశ్యామ్ మూవీస్ కు సహ నిర్మాతగా వ్యవహరించిన ఆదిపురుష్ మూవీ నిర్మాత టి – సిరీస్ సంస్థ అధినేత భూషణ్ కుమార్ టీజర్ లాంచ్ లో ప్రభాస్ తో కలిసి పని చేయడం గురించి మాట్లాడుతూ ..హీరో ప్రభాస్ తో ఆదిపురుష్ మాకు మూడవ చిత్రమనీ , ఆదిపురుష్ తర్వాత సౌత్ సూపర్ స్టార్ ప్రభాస్ తో నాల్గవ చిత్రాన్ని చేయనున్నామనీ , ఇప్పటికే నాల్గవ చిత్రాన్ని కూడా లాక్ చేశామనీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























