మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న సినిమా పొన్నియన్ సెల్వన్. ఈసినిమా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు అన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో భారీ కాస్టింగ్ తో ఈసినిమాను తెరకెక్కించాడు. మణిరత్నం నుండి వస్తున్న సినిమా కాబట్టి సినిమా ప్రకటించినప్పటినుండే ఈసినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇక భారీ అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉంది.. ఆ అంచనాలను రీచ్ అయిందా లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. విక్రమ్, కార్తీ, త్రిష, పార్తిబన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, జయరామ్, జయం రవి, శోభిత ధూళిపాల, ప్రభు తదితరులు
దర్శకత్వం.. మణిరత్నం
బ్యానర్స్.. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్
తెలుగు సమర్పకులు.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాతలు.. మణిరత్నం, అల్లి రాజా సుభస్కరన్
సంగీతం.. ఏ.ఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫి.. రవి వర్మన్
కథ
చోళ చక్రవర్తి సుందర చోళుడు(ప్రకాష్ రాజ్) ఆయనకు ఇద్దరు కుమారులు ఆదిత్య కరికాలన్ (విక్రమ్), అరుళ్ మొలి అలియాస్ పొన్నియన్ సెల్వన్ (జయంరవి), కుమార్తె కుందవై (త్రిష). తన తర్వాత వారసుడిగా పెద్ద కుమారుడు ఆదిత్య కరికాలుడు ను యువరాజుగా సుందర చోళుడు ప్రకటిస్తాడు. దీంతో ఇద్దరు కుమారులు కంచి, శ్రీలంకలో యువరాజులుగా కొనసాగుతుంటారు. అయితే సుందర చోళుడు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాడు పళు వెట్టరాయర్ (శరత్ కుమార్). ఈ క్రమంలోనే సుందర చోళుడు అన్నయ్య కుమారుడు మధురాంతకుడు (రహమాన్) ను రాజును చేయాలని సుందర చోళుడి నిర్ణయానికి వ్యతిరేకంగా సామంత రాజులను ఏకం చేస్తాడు. అయితే తన తండ్రి రాజ్యంలో ఏదో జరుగుతుందని తెలుసుకున్న ఆదిత్య కరికాలన్ తన స్నేహితుడైన వల్లవరాయన్ వందియ దేవుడు (కార్తి) ని అక్కడకు పంపిస్తాడు. అక్కడకు వెళ్లిన వల్లవరాయన్ పళు వెట్టరాయర్ కుట్ర తెలుసుకుంటాడు. మరి కుట్ర గురించి తెలుసుకున్న ఆదిత్య కరికాలన్ ఏం చేశాడు.. పళు వెట్టరాయర్ కుట్రను ఎలా తిప్పికొట్టారు.. సుందర చోళుడు రెండో కుమారుడు అరుళ్ మౌళి (‘జయం’ రవి), కుమార్తె కుందైవై (త్రిష) ఏం చేశారు? పళు వెట్టరాయర్ భార్య నందిని దేవి (ఐశ్వర్యా రాయ్ బచ్చన్) ఉన్నంత వరకూ తంజావూరు రానని ఆదిత్య కరికాలుడు ఎందుకు చెబుతున్నాడు? వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? చివరకు ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ
క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నుండి వచ్చిన ఎన్నో క్లాసిక్ సినిమాలతోనే ఆయన టేకింగ్ ఎలా ఉంటుందో చెప్పొచ్చు. అలాంటిది మణిరత్నం నుండి సినిమా అంటే కామన్ గానే సినీ లవర్స్ అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. అందులోనూ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఇక మణిరత్నం కూడా ఈసినిమాను అదే రేంజ్ లో తెరకెక్కించాడు. నిజానికి పీరియాడిక్ సినిమాలు తీయడం అంటే అంత ఈజీ కాదు. ఏదో కమర్షియల్ సినిమాలు తీసినట్టు తీస్తే సరిపోదు. ఇక తెలిసిన కథలను తెరపైన చూపించడం.. ప్రేక్షకులను మెప్పించగలగడం కత్తి మీద సాము లాంటిది. అయితే మణిరత్నం లాంటి డైరెక్టర్ అలాంటి విషయాలు బాగానే అర్థం చేసుకోగలడు. ఆ ధైర్యంతోనే చోళ సామ్రాజ్య చరిత్రను తీయడానికి ముందుకొచ్చాడు.
చోళ రాజ్యంలో జరిగిన సమరమే ఈ చిత్రంలో ప్రధాన హైలైట్. మనకు తెలియని చరిత్రలో దాగిన వీరుల కథలకు ఫిక్షనల్ అంశాలని జోడించి మణిరత్నం ఈ సినిమాని విజువల్ గా చాలా బాగా తెరకెక్కించాడు. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు సినిమాను ఒక యుద్ధంతో ప్రారంభించాడు. ఇలాంటి క్లిష్ట సబ్టెక్ట్‌ను తెరపై చక్కగా ఆవిష్కరించాడని చెప్పొచ్చు. ప్రమోషన్స్ లో కార్తి చెప్పినట్టు ఈసినిమాను ఎక్కువ భాగం న్యాచురల్ లొకేషన్స్ లోనే తెరకెక్కించినట్టు అర్థమవుతుంది. మణి రత్నం టేకింగ్ బాగుంది. క్లైమాక్స్‌లో వచ్చే సముద్రపు సన్నివేశాలను ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి.
పెర్ఫామెన్స్
ఇక నటీనటుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందరూ స్టార్ హీరోలు, హీరోయిన్సే. వారి నటనకు పేర్లు పెట్టలేము. చోళ రాజ్యపు యువరాజుగా విక్రమ్, పగతో రగిలిపోయే నందిని పాత్రలో ఐశ్వర్య రాయ్ బచ్చన్, గొప్ప వీరుడిగా జయం రవి అధ్భుతంగా నటించారు. త్రిష కుందవై సుగుణవతి పాత్రలో ఒదిగిపోయింది. శత్రువుల ఎత్తులను చిత్తులు చేసే పాత్రలో తనదైన నటన కనబరిచింది. ఇక ముఖ్యంగా కార్తీ రోల్ కూడా ఈ పార్ట్ లో చాలా కీలకం. కార్తీ క్యారెక్టర్‌లో కామెడీ షేడ్స్ ఉన్నాయి. అటు వినోదం, ఇటు వీరత్వం… సన్నివేశాలకు అనుగుణంగా ఆయన నటించారు. ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, పార్తీబన్, జయరామ్ తదితరులు పాత్రలకు అనుగుణంగా నటించారు. ఆయా పాత్రలకు వాళ్ళు హుందాతనం తీసుకొచ్చారు.
ఈసినిమాలకు టెక్నికల్ వాల్యూస్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫి ఇంకా బ్యాక్ గ్రౌండ్ స్కోర్. విజువల్స్ ను బట్టే ఆడియన్స్ స్క్రీన్ పై ఆ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. అలానే సీన్ కు తగ్గ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పండాలి. ఈ విషయంలో వీ.ఎఫ్.ఎక్స్ దగ్గర నుంచీ కెమెరా వర్క్, నేపథ్య సంగీతం వరకూ ప్రతి క్రాఫ్ట్ వర్క్ చక్కగా కుదిరిందని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు అద్భుతం.
ఓవరాల్ గా చెప్పాలంటే ఇలాంటి కథలు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. చరిత్రలో మనకు తెలియని ఎన్నో విషయాలను డైరెక్టర్లు ముందుకు వచ్చి తెలియచేసే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఇలాంటి సినిమాలను ఆవర్గం, ఈ వర్గం అని కాకుండా అందరూ ఖచ్చితంగా చూడాలి అని చెప్పొచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























