ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల బర్త్ డేస్ కు వారి పాత సూపర్ హిట్ మూవీస్ ను నూతన టెక్నాలజీ తో రీరిలీజ్ చేసే ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే . సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా పోకిరి మూవీ 4k తో స్పెషల్ షోస్ వేయగా భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఘరానామొగుడు చిత్రాన్ని విడుదల చేయగా.. దానికి కూడా రెస్పాన్స్ వచ్చింది. ఇక సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా జల్సా సినిమాను రీరిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే (అక్టోబర్ 23)సందర్భంగా సూపర్ హిట్ బిల్లా, వర్షం మూవీస్ రీ రిలీజ్ కానున్నాయని సమాచారం. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శోభన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ వర్షం , గోపీకృష్ణా మూవీస్ బ్యానర్ పై మెహెర్ రమేష్ దర్శకత్వం లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ బిల్లా మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ రెండు మూవీస్ 4K ప్రింట్స్ తో ప్రభాస్ బర్త్ డే కు రీ రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఆది పురుష్ , సలార్ , ప్రాజెక్ట్ K మూవీస్ అప్ డేట్స్ కూడా అభిమానులను అలరించనున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























