2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ముత్తయ్య దర్శకత్వంలో కార్తీ , అదితి శంకర్ జంటగా “విరుమాన్” తమిళ మూవీ ఆగస్టు 12 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రముఖ దర్శకుడు శంకర్ ఎస్ తనయ అదితి శంకర్ “విరుమాన్” మూవీతో కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. రాజ్ కిరణ్ , ఇళవరసు , ప్రకాష్ రాజ్ , సూరి ముఖ్య పాత్రలలో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శాంతి టాకీస్ బ్యానర్ పై మడోన్నా అశ్విన్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “మావీరన్” తమిళ మూవీ పూజాకార్యక్రమం తో ప్రారంభం అయ్యింది. ఈ మూవీ లో హీరో శివకార్తికేయన్ కు జోడీగా అదితి శంకర్ ఎంపిక అయ్యారు.మొదటి సినిమా రిలీజ్ కాకుండానే రెండవ తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అదితి శంకర్ ఒక తెలుగుమూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. వరస ఆఫర్స్ తో అదితి శంకర్ బిజీగా ఉన్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































