సూపర్ హిట్ “చిరుత” మూవీ తో టాలీవుడ్ హీరోగా పరిచయం అయిన రామ్ చరణ్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ , ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “#RC15 ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ ” మూవీని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమురం భీమ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హాలీవుడ్ జేమ్స్ బాండ్ సిరీస్ మూవీస్ కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. డేనియల్ క్రైగ్ హీరో గా తెరకెక్కిన “నో టైమ్ టు డై ” మూవీ 2021 సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. జేమ్స్ బాండ్ గా నటించే నటులు మూడు లేదా నాలుగు సినిమాలకు మించి నటించరు. తాజాగా జేమ్స్ బాండ్ పాత్రకు ఎవరికిని ఎంపిక చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. జేమ్స్ బాండ్ గా
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. “మార్వెల్స్ ల్యూక్ కేజ్” టీవీ సిరీస్ క్రియేటర్ సి హెచ్ కోకెర్ జేమ్స్ బాండ్ పాత్రకు రామ్ చరణ్ అన్ని విధాలా అర్హుడు అని ట్వీట్ చేశారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























