“సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు.నిధి ప్రస్తుతం “హీరో ”, “హరిహర వీరమల్లు” (తెలుగు ) , ఒక తమిళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.“భూమి “, “ఈశ్వరన్”తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన ఇస్మార్ట్ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నిధి టాలీవుడ్ , కోలీవుడ్ లో హాట్ హీరోయిన్ గా మారారు. కోలీవుడ్ స్టార్ హీరోస్ నిధి తో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. కోలీవుడ్ లో నిధికి మంచి ఛాన్సులు వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన తాజా ఫొటోస్ ను షేర్ చేస్తూ నిధి అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అభిమానులతో చిట్ చాట్ లో పాల్గొన్న నిధి ,హీరో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి చాలా గొప్పగా చెప్పారు. తన ఫేవరేట్ సాంగ్ “లాలా భీమ్లా ” అనీ , రిపీటెడ్‌గా వింటున్నాననీ చెప్పారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న “భీమ్లా నాయక్ “మూవీ టైటిల్ సాంగ్ “లాలా భీమ్లా ” సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























