మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం జనవరి 13 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. కీర్తి సురేష్ కథానాయిక. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. దుబాయ్ , హైదరాబాద్ , గోవా లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ”సర్కారు వారి పాట”మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ను స్పెయిన్ దేశంలో జరుపుకుంటుంది. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో “#SSMB 28 “, స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక మూవీ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“సర్కారు వారి పాట” మూవీ కి సంబంధించి అభిమానులకు సంగీత దర్శకుడు ఎస్.ఎస్ తమన్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. రీసెంట్‌గా ఈ మూవీ మ్యూజిక్ కంపోజిషన్ పూర్తి అయినట్లు థమన్ తెలుపుతూ సెట్స్ లో మహేశ్‌తో బాబు తో తీసుకున్న ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ ఫోటో లో మహేష్ బాబు సూపర్ స్టైలిష్‌గా ఉన్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























