పవన్-రానా కాంబినేషన్ లో మలయాళం సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే ఈసినిమా మళ్లీ సెట్స్ పైకి వెళ్లింది. ఇక ఈసినిమాలో పవన్ పోలీస్ అధికారి భీమ్లా నాయక్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. భీమ్లా నాయక్ అంటూపవన్ కళ్యాణ్ పాత్ర పేరును రివీల్ చేసిన క్షణం నుంచి సినిమా మీద మరింత బజ్ ఏర్పడింది. ఇక సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో ఇటీవలే రిలీజ్ అయి ఎంత వైరల్ అయిందో చూశాం. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా నుండి తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్‌ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదల చేయబోతోన్నట్టు సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అధికారికంగా ప్రకటించారు. ఆగస్ట్ 15న ఉదయం 9 గంటల 45 నిమిషాలకు ఈ మూవీకి టైటిల్‌ను ప్రకటించబోతోన్నట్టు మేకర్స్ తెలిపారు. అంతేకాదు దీనితో పాటు స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ గళ్ళ లుంగీ, బ్లూ షర్ట్ ధరించి ఉండగా పవన్ ఫ్యాన్స్ అప్పుడే వైరల్ చేసే పనిలో పడ్డారు.
Power Storm is all set to takeover with the Title & First Glimpse on 15th Aug from 09:45AM⚡
Get ready for the adrenaline rush 💉🔥#BheemlaNayak @pawankalyan @RanaDaggubati #Trivikram @MenenNithya @MusicThaman @saagar_chandrak @dop007 @NavinNooli @vamsi84 pic.twitter.com/SaqwNROqV7
— Sithara Entertainments (@SitharaEnts) August 13, 2021
కాగా పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. పవన్ కి జోడీగా నిత్యామీనన్, రానాకి జంటగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తుండగా.. సముద్రఖని, మురళీశర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: