పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఇక నిన్న కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి వచ్చిన అప్ డేట్స్ ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. ముందు ఈసినిమా నుండి చిన్న టీజర్ ను రిలీజ్ చేయగా అందులో మహేష్ మేకోవర్, మహేష్ యాక్షన్ ను చూసి అందరూ ఫిదా అయిపోయారు. మళ్లీ పాత మహేష్ ను చూస్తున్నట్టే ఉంది అని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక మహేష్ బాబు అందం గురించి కూడా స్పెషల్ గా డైలాగ్స్ రాసినట్టు ఉన్నారు. సార్ ప్రతీ రోజూ పడుకునే ముందు దిష్టి తీయడం మరిచిపోకండి అని ఏకంగా హీరోయిన్ తో డైలాగ్ చెప్పించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాలో కీర్తి సురేష్ పాత్ర పేరేంటో తెలిసిపోయింది. అందరిలాగే కీర్తి సురేష్ కూడా మహేష్ కు బర్త్ డే విషెస్ అందించింది. “మీరు తెరపై మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్లో కూడా చాాలా ఇన్ఫిరేషన్.. వండర్ ఫుల్ కో స్టార్.. హ్యాపీ బర్త్ డే మహేష్ సర్” అని కీర్తి ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్ కు రిప్లై ఇచ్చిన మహేష్ థ్యాంక్స్ ‘కళావతి’ అని రిప్లై ఇచ్చారు. దీంతో “సర్కారు వారి పాట”లో కీర్తి సురేష్ “కళావతి” అనే పాత్రను పోషిస్తుందని తెలిసిపోయింది.
పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























