‘గాలి సంపత్’ కు ఇవే హైలెట్స్

Gaali Sampath : Here Are The Key Highlights To Watch In The Movie,Gaali Sampath Movie Key Highlights,Gaali Sampath Movie Highlights,Sree Vishnu,Rajendra Prasad,Anil Ravipudi,Gaali Sampath Music,Gaali Sampath Movie Plot,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Sree Vishnu Gaali Sampath,Gaali Sampath,Gaali Sampath Movie,Gaali Sampath Songs,Gaali Sampath Telugu Movie,Gaali Sampath Movie Telugu,Reasons To Watch Gaali Sampath,Reasons To Watch Gaali Sampath Movie,Reasons To Watch Gaali Sampath Telugu Movie,Reasons To Watch Gaali Sampath Movie,Reasons To Watch Sree Vishnu Gaali Sampath,Gaali Sampath From March 11th,Gaali Sampath Theatrical Release Tomorrow,Gaali Sampath Movie Update,Gaali Sampath Movie Songs,Gaali Sampath On March 11th,Gaali Sampath Movie Story,Anish Krishna

అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రాజేంద్ర ప్రసాద్- శ్రీ విష్ణు ప్రధానపాత్రల్లో వస్తున్న సినిమా గాలి సంపత్. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లతో సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచేశారు. ప్రేక్షకులు కూాడ ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎస్‌. క్రిష్ణ ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్టైన్మెంట్ బేన‌ర్‌ పై, షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి ఈ సినిమాను నిర్మించారు. అనిల్ రావిపూడి స‌మ‌ర్పించడమే కాదు.. స్క్రీన్‌ప్లే తో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా అందించడం విశేషం. ఇక ఈసినిమా రేపు విడుదలవుతున్న నేపథ్యంలో సినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఎంటో ఒకసారి చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

* ఈసినిమాలో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్ గురించి. ఈసినిమాకు కీలకం ఆయనే అని అర్ధమవుతుంది. ట్రైలర్ లో శాంపిల్ చూపించారు కదా. ఫిఫీఅంటూ రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. కేవలం కామెడీ మాత్రమే కాదు ఎమోషన్ సీన్స్ కూడా అదే రేంజ్ లో ఉండబోతున్నట్టు అర్ధమవుతుంది.

* రాజేంద్ర ప్రసాద్-శ్రీవిష్ణు కాంబనేషన్.. శ్రీవిష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తను ఎలాంటి సినిమాలు ఎంచుకుంటాడో తెలుసు. ఇక మొదటిసారి రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో చేస్తున్నాడు. తండ్రిగా రాజేంద్ర ప్రసాద్.. కొడుకుగా శ్రీవిష్ణు చేయడమే సినిమాకు ప్లస్ పాయింట్. వీరిద్దరి నటనను స్క్రీన్ పై చూడాల్సిందే.

* అనిల్ రావిపూడి.. వరుసగా ఐదు సినిమాలు.. అవి కూడా సూపర్ హిట్. అలాంటి అనిల్ రావిపూడి ఈసినిమాకు తన పూర్తి సహకారం అందించాడు. ఈసినిమాకు స్క్రీన్ ప్లే ఒక్కటే కాదు తన స్లేహితుడి కోసం దర్శకత్వం పర్యవేక్షణలో కూడా ఒక చేయి వేశాడు. ఇక అనిల్ రావిపూడి కామెడీ మార్క్ ఈ సినిమాలో క్లియర్ గా కనిపిస్తుంది.

* కథ.. నిజానికి ఇలాంటి కథతో సినిమా రావడం ఇదే మొదటి సారి. ఒక మాటలు రాని వ్యక్తి బోరు బావిలో పడితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఫన్, ఎమోషన్ తో పాటు సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి.

* మరి ఇన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్న ఈసినిమాపై చిత్రయూనిట్ అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం రేపటి వరకూ వెయిట్ చేయాల్సింటే..

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.