చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్, రకుల్ ప్రీత్, ప్రియా వారియర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం చెక్. చంద్రశేఖర్ యేలేటి లాంటి క్రియేటివ్ డైరెక్టర్, నితిన్ కాస్త డిఫరెంట్ కథతో వస్తుండటంతో ఈ సినిమాపై మొదటినుండి భారీ అంచనాలే ఉన్నాయి. దానికితోడు టీజర్, ట్రైలర్ లు కూడా సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఇక నేడు ఈసినిమా రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అనుకున్న అంచనాలను ఈ సినిమా రీచ్ అయిందో లేదో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు: నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్, సంపత్ రాజ్, సాయిచంద్, పోసాని కృష్ణ మురళీ, మురళీ శర్మ తదితరులు
డైరెక్టర్: చంద్రశేఖర్ యేలేటి
నిర్మాత: వీ ఆనంద ప్రసాద్
సంగీతం: కల్యాణి మాలిక్
సినిమాటోగ్రఫర్: రాహుల్ శ్రీవాస్తవ్
కథ:
ఆదిత్య (నితిన్) పేర్లు మార్చుకుంటూ చిన్న చిన్న మోసాలు చేస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ గడుపుతుంటాడు. ఈ క్రమంలోనే యాత్ర ( ప్రియా ప్రకాష్ వారియర్)ను కూడా ప్రేమిస్తాడు. అలా హాయిగా లైఫ్ సాగిపోతుండగా భారత్‌లో జరిగిన ఉగ్రదాడి కేసు కింద అతడిని అరెస్ట్ చేస్తారు. ఉరిశిక్ష కూడా వేస్తారు. అయితే దానికి కారణం తను ప్రేమించిన యాత్ర అని తర్వాత తెలుస్తుంది. ఇక జైలులో ఆదిత్యకు శ్రీమన్నారాయణ(సాయిచంద్)అనే ఖైదీ పరిచయమై చెస్ ఆటను నేర్పిస్తాడు. ఇదిలా ఉంటే ఆదిత్యకు క్షమాభిక్ష లభించేలా చేసేందుకు జూనియర్ లాయర్ మానస(రకుల్ ప్రీత్ సింగ్) ప్రయత్నిస్తుంది. దానికి చెస్ ఆటను వాడుకుంటుంది. ఈ క్రమంలో ఎస్పీ నరసింహారెడ్డి(సంపత్ రాజ్) ఆదిత్యకు క్షమాభిక్ష లభించకుండా చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. అసలు యాత్ర ఎవరు..?యాత్ర వల్ల ఆదిత్యపై టెర్రిరిస్టు ముద్ర ఎందుకు పడింది. ఆదిత్య నిర్ధోషి అని మానస ప్రూవ్ చేసిందా? జైలులో ఖైదీగా ఉన్న ఆదిత్య అంతర్జాతీయ స్థాయిలో గ్రాండ్ మాస్టర్‌గా ఎలా మారాడు.. నరసింహరెడ్డి ఎందుకు ఆదిత్యపై పగ పెంచుకొంటాడు? చివరకు ఆదిత్య ఎలా జైలు నుంచి బయటపడ్డాడు అనేదే కథ
విశ్లేషణ:
నిజానికి కమర్షియల్ సినిమాలు వచ్చినంతగా ఇలాంటి సినిమాలు రావడం చాలా రేర్. అందుకే చెక్ సినిమా కాస్త భిన్నంగా ఉండబోతుందని ముందునుండే ఆస్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఇలాంటి సినిమాలు తీయడంలో చంద్రశేఖర్ యేలేటికి కొట్టిన పిండి లాంటిది. చంద్రశేఖర్ యేలేటి సినిమా అంటే మైండ్ గేమ్, ఇంటెలిజెన్సీకి పెద్ద పీట వేస్తారన్న సంగతి తెలిసిందే. చెక్ సినిమాను కూడా అలానే తెరకెక్కించారు. గత సినిమాలే మాదిరే మైండ్ గేమ్‌కి పెద్ద పీట వేశాడు. అంతేకాదు జైలులో ఖైదీల ప్రవర్తన, వాతావరణాన్ని చక్కగా చూపించారు. సినిమా మొదటి నుండి చివరి వరకూ తన క్రియేటివ్ మ్యాజిక్ తో ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయగలిగాడు.
ఇక ఆదిత్య పాత్రలో నితిన్ ది బెస్ట్ ఇచ్చాడు. ఉరిశిక్ష పడిన ఖైదీగా, చెస్ ప్లేయర్‌గా, ప్రేమికుడిగా మూడు షేడ్స్ లోనూ ఒదిగిపోయాడు. అలాగే ఈ సినిమాలో ఫైట్స్ కూడా చాలా చక్కగా చేశాడు. నితిన్ తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర సాయిచంద్‌ది. చేయని తప్పుకు జైలుపాలైన శ్రీమన్నారాయణ పాత్రలో సాయిచంద్ ఒదిగిపోయాడు. అతని సంభాషణలు, ఎక్స్ప్రెషన్స్ సినిమాకే హైలెట్.
ఇక లాయర్ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ బాగానే నటించింది. ఇందులో గ్లామర్‌కు ప్రాధాన్యత ఇవ్వకుండా నటనతో మెప్పించింది. ఇక మరో హీరోయిన్ ప్రియ ప్రకాష్ వారియర్ కూడా చక్కగా నటించింది. తన పాత్ర నిడివి తక్కువే అయినా కూడా కీలకమైన పాత్రనే చేసింది. యాత్రగా నితిన్ ప్రేయసిగా ఆకట్టుకుంది. ఇక నెగిటివ్ కోణంలో సంపత్ రాజ్ పాత్ర కూడా నటనతో ఆకట్టుకుంటాడు. రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి పాత్రలో పొసాని,జైలర్‌గా మురళీ శర్మ తమ పరిధి మేరకు నటించారు.
కల్యాణీ మాలిక్ సంగీతం ఈ సినిమాకు చాలా ప్లస్ పాయింట్. తన నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాడు. ఒక్క పాట మాత్రమే ఉంది. రాహుల్ శ్రీవాస్తవ్ అందించిన సినిమాటోగ్రఫి సూపర్. జైల్ ఎపిసోడ్‌ను అద్భుతంగా తెరకెక్కించారు. భవ్య క్రియేషన్స్ నిర్మాణ విలువలు రిచ్ గా కనిపిస్తాయి.
ఫస్టాఫ్ అంతా ఎలాంటి ట్విస్ట్‌లను రివీల్ చేయకుండా నార్మల్‌గా నడిపించాడు. అసలు హీరో ఈ కేసులో ఎలా ఇరుక్కున్నాడో చెప్పకుండా ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచాడు. మంచి ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ ముగిస్తాడు. ఇక సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. సెకండాఫ్‌లో కోర్టు, చెస్ ఆట, జైలులో గొడవలు ఇలా ట్విస్ట్ లతో సాగుతుంది. ఫైనల్ గా చెప్పాలంటే మైండ్ గేమ్‌తో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని చెప్పొచ్చు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































