యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాపిడ్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. అలా మొదలుపెట్టాడో లేదో ఇలా ‘సలార్’ ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేశాడు. ప్రభాస్ హీరోగా కె.జి.యఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ‘సలార్’ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇన్నిరోజులు తెలంగాణా లోని గోదావరి ఖని లో ఉన్న సింగరేణి గనుల్లో మొదటి షెడ్యూల్ ను జరుపుకుంది. ఇక అక్కడ హీరో ప్రభాస్, శృతిహాసన్‌లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పుడు మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కేజీఎఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక కన్నడ స్టార్ మధు గురుస్వామిని ప్రభాస్ కు విలన్‌గా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై ‘సలార్’ టీం అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్టు సమాచారం. తదితరుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కావచ్చింది. ఇక ఇది సెట్స్‌లో ఉండగానే ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాకి, ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాగ్ అశ్విన్ సినిమా మొదలవడానికి ఇంకా టైం పడుతుంది కానీ.. ఆదిపురుష్ సినిమా మాత్రం ఇప్పటికే మొదలైంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























