కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇటీవలే తాజాగా ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో రామ్‌చరణ్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక చరణ్ ‘ఆచార్య’ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఈ సినిమాలో రామ్‌చరణ్ సిద్ధ అనే పాత్రను పోషిస్తున్నారని దర్శకుడు కొరటాల శివ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘మా సిద్ధ సర్వంసిద్ధం. రామ్‌చరణ్‌కు సుస్వాగతం’ అంటూ ప్రీలుక్ పోస్టర్‌ను పంచుకున్నారు. ఇందులో రామ్‌చరణ్ చెవిపోగు ధరించి భుజాల మీదుగా రుద్రాక్ష మాలతో కనిపిస్తున్నారు.
మా ‘ సిద్ధ ‘ సర్వం సిద్ధం.
Welcoming our #ramcharan garu onto the sets of #Acharya. @AlwaysRamCharan @KChiruTweets #manisharma @DOP_Tirru @NavinNooli @sureshsrajan @KonidelaPro @MatineeEnt pic.twitter.com/hJaaYDqF1K— koratala siva (@sivakoratala) January 17, 2021
ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఒకవైపు పూర్తి చేసుకుంటూ.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే ఏడాది మే లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























