‘బాహుబలి’, ‘సాహో’తో ప్యాన్ ఇండియా స్టార్ రేంజ్ కు ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వం లో రాధేశ్యామ్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్‌లుక్, ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ వీడియోకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి. ఇక టీజర్ ఎప్పుడేప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకు దర్శకుడు రాధాకృష్ణ కుమార్ రీసెంట్ గా ఒక ఓ ప్రామిస్ చేసిన సంగతి కూడా విదితమే. త్వరలోనే ఈ సినిమా టీజర్ అప్ డేట్ ఇస్తానని చెప్పాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అది కూడా చివరిదశకు చేరుకుంది. కొద్దిరోజులుగా హైద్రాబాద్ లోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా చిన్న గ్యాప్ తీసుకున్న చిత్రయూనిట్ మళ్ళీ షూటింగ్ ను మొదలుపెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో షూటింగ్ జరుపుకుంటుంది.
కాగా ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























