ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మధ్య ఫ్రెండ్ షిప్ అరుదుగా ఉంటుంది. స్టార్ హీరోయిన్స్ శృతి హాసన్ , తమన్నా బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. తమన్నా ప్రస్తుతం పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. శృతి హాసన్ 2 తెలుగు , ఒక తమిళ మూవీ షూటింగ్స్ కంప్లీట్ చేసి హాలీ డేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. శృతి హాసన్ , తమన్నా తమ మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ గురించి పలు ఇంటర్వూస్ లో చెప్పిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక ఇంటర్వ్యూ లో శృతి మాట్లాడుతూ .. తాను తమన్నా ను జన్యూన్ గా గౌరవిస్తాననీ , తమన్నా ఓపిక , దయ , హానెస్ట్ గా వుండే కామ్ పర్సన్ అనీ , తమన్నా నుండి చాలా నేర్చుకున్నాననీ తమన్నా పై ప్రశంసలు కురిపించారు. స్టార్ హీరోయిన్స్ శృతి , తమన్నా ఇద్దరు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. శృతి , తమన్నా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను ఘనంగా జరుపుకున్నారు. న్యూ ఇయర్ ఫస్ట్ డే రోజున తన బెస్ట్ ఫ్రెండ్ తమన్నా ను చూడడం ఆనందంగా ఉందనీ , తామిద్దరి ఫోటో ను శృతి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫోటో అభిమానులను ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























