అభిమానులకు కాస్త నిరాశ పరిచే వార్తే చెప్పారు తలైవా, సూపర్ స్టార్ రజినీ కాంత్. రజినీ పొలిటికల్ ఎంట్రీ పై ఎప్పుడూ ఏదో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక ఎంతో కాలంగా రజినీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని అభిమానులతో పాటు అందరూ ఎదురుచూస్తున్నారు . అయితే ఇటీవలే రాజకీయాల్లోకి వస్తున్నానని.. డిసెంబర్ 31న తన పార్టీ పేరుని అనౌన్స్ చేస్తానని, జనవరిలో పార్టీని స్టార్ట్ చేస్తానని ఆయన తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రోజు కోసం ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ గ్యాప్ లోనే మరో ట్విస్ట్ ఇచ్చారు రజినీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ప్రారంభిచలేనంటూ ట్విట్టర్ వేదికగా ఒక లేఖను విడుదల చేశారు. అనారోగ్య కారణాల కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని .. తానిచ్చిన మాటను వెనక్కి తీసుకోవడంపై తనను క్షమించాలంటూ అభిమానులను కోరారు. రాజకీయ ప్రకటనకు ముందు ఆసుపత్రిలో తాను చేరడమనేది దేవుడి హెచ్చరికగా భావిస్తున్నట్టు లేఖలో తెలిపారు. ఈ మేరకు ఆయన చేసిన ప్రకటన అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది.
— Rajinikanth (@rajinikanth) December 29, 2020
ప్రస్తుతం రజినీ శివ దర్శకత్వంలో అన్నాత్తే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం గతకొద్దిరోజులుగా హైద్రాబాద్ లో ఉన్నారు. అయితే చిత్ర సిబ్బందిలో దాదాపు 4గురికి కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ ను కూడా రద్దు చేశారు. రజనీకాంత్ కూడా కరోనా పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. అయితే హైబీపీతో బాధపడుతుండటంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో చేరిన సంగతి కూడా విదితమే.అయితే ప్రస్తుతం కోలుకోగా నిన్ననే డిశ్చార్జ్ అయి చెన్నై వెళ్లారు. ఇక రజినీ ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో కుటుంబసభ్యులు కూడా ఇప్పుడే పాలిటిక్స్ వద్దని చెప్పడంతో రజినీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
ఇక లాక్ డౌన్ ముందే ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తయింది. అయితే ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలివుంది. ఇటీవలే మళ్లీ ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























