అఖిల్ అక్కినేని వీకెండ్ హార్స్ రైడింగ్

Akhil Akkineni Shares A Candid Picture From His Weekend Horse Riding Session On Social Media

యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయిక. ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. భారీ అంచనాలు ఉన్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ మూవీ తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీబడ్జెట్ తో రూపొందనున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ కి అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హార్స్ రైడింగ్ పై ఆసక్తి చూపే టాలీవుడ్ హీరో రామ్ చరణ్ అని తెలిసిందే. ఇప్పుడు అఖిల్ అక్కినేని హార్స్ రైడింగ్ పై ఆసక్తి చూపుతున్నారు. స్వంతంగా ఒక హార్స్ ఉన్న అఖిల్ వీకెండ్స్ లో హార్స్ రైడింగ్ చేస్తారు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ .. హార్స్ రైడింగ్ తనను రిలాక్స్ గా ఉంచుతుందనీ , వారానికి సరిపడా శక్తి , ఉత్సాహాన్ని ఇస్తుందనీ , వీకెండ్ లో హార్స్ రైడింగ్ చేస్తాననీ చెప్పారు.
తన హార్స్ రైడింగ్ ఫొటోను అఖిల్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.