మరో తమిళ మూవీలో రష్మిక ?

Rashmika Mandanna Likely To Act Opposite Suriya In His Next Movie.

తెలుగు , తమిళ బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రీసెంట్ గా “సుల్తాన్ “తమిళ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసిన రష్మిక ఇప్పుడు మరో తమిళ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారని సమాచారం. హీరోయిన్ రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న “పుష్ప “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా రూపొందే “ఆడాళ్ళూ మీకు జోహార్లు ” మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆకాశం నీ హద్దురా ” మూవీ తో మంచి విజయాన్ని సాధించిన స్టార్ హీరో సూర్య మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్” #SURYA40″మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో సూర్య కు జోడీగా రష్మిక ఎంపిక అయ్యారని సమాచారం. తెలుగు , కన్నడ మూవీస్ తో పాటు తమిళ మూవీస్ లో కూడా రష్మిక బిజీగా మారనున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ ,వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న రష్మిక ను గూగుల్ నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.