సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన లావణ్య త్రిపాఠి తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “దూసుకెళ్తా “, “భలే భలే మొగాడివోయ్””సోగ్గాడే చిన్ని నాయనా “, “అర్జున్ సురవరం”వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యతనిచ్చే లావణ్య తన వర్కౌట్ ఫొటోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్



హీరోయిన్ లావణ్య ప్రస్తుతం హాకీ నేపథ్యం లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “A1 ఎక్స్ ప్రెస్ ” మూవీ లో హీరో సందీప్ కిషన్ కు జోడీగా నటిస్తున్నారు. ఇటీవలే ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. హాకీ ప్లేయర్ గా నటిస్తున్న లావణ్య ఆ పాత్రకి హాకీ లో శిక్షణ తీసుకున్నారు. హీరో కార్తికేయ కథానాయకుడిగా రూపొందుతున్న “చావు కబురు చల్లగా ” మూవీ లో కార్తికేయ కు జోడీగా నటిస్తున్న లావణ్య షూటింగ్ లో పాల్గొంటున్నారు. సోషల్ మీడియా లో షేర్ చేసే అందమైన లావణ్య ఫోటోలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాయి. ఇప్పుడు తాజా ఫొటో షూట్ లో పాల్గొన్న లావణ్య ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























