భారతీయ చలన చిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా బయోపిక్ మూవీస్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. లెజెండరీ ఫిల్మ్ స్టార్స్ నందమూరి తారక రామారావు , సావిత్రి బయోపిక్ మూవీస్ రూపొందాయి. లెజెండరీ యాక్ట్రెస్ , పొలిటికల్ లీడర్ జయలలిత బయోపిక్ “తలైవి “మూవీ రూపొందుతుంది. ఇప్పుడు కోట్లాది ప్రజల అభిమాన కథానాయకుడు తలైవా రజనీకాంత్ పై బయోపిక్ మూవీ రూపొందనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కె బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన “అపూర్వ రాగంగళ్ “(1975 ) మూవీ తో రజనీకాంత్ కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రజనీకాంత్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. “అంతులేని కథ “మూవీ తో రజనీకాంత్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. కెరీర్ ప్రారంభం లో చిన్న పాత్రలు , విలన్ పాత్రలలో నటించిన రజనీకాంత్ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోగా రాణిస్తున్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా కళామతల్లి కి సేవలు అందిస్తున్న రజనీకాంత్ పద్మ విభూషణ్ , పద్మ భూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. హీరో రజనీకాంత్ వీరాభిమాని దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా రజనీకాంత్ బయోపిక్ మూవీ తెరకెక్కనుందని సమాచారం.ఈ బయోపిక్ లో రజనీకాంత్ కెరీర్ లో మలుపుతిప్పిన మూవీస్ , సంఘటనలతో తెరకెక్కనుంది. ఈ న్యూస్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రజనీకాంత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























