తెలుగు , తమిళ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అనుష్క స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. మొదట గ్లామర్ పాత్రలలో ప్రేక్షకులను ఆకట్టుకున్న అనుష్క తరువాత లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు శ్రీకారం చుట్టారు. “అరుంధతి “రుద్రమ దేవి “, “భాగమతి “వంటి సూపర్ హిట్ మూవీస్ లో అనుష్క అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలతో పాటు బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు. “సైరా నరసింహారెడ్డి “మూవీ లో ఝాన్సీ లక్ష్మీ బాయ్ గా అతిథి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరోయిన్ అనుష్క బర్త్ డే (నవంబర్ 7) సందర్భంగా అనుష్క బర్త్ డే సీడీపీ రిలీజ్ అయ్యింది. అనుష్క బర్త్ డే సీడీపీ ని దర్శకుడు గుణశేఖర్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అత్యద్భుతమైన , చిరస్మరణీయ ప్రదర్శనతో మన హృదయాలను గెలుచుకున్న మా వారియర్ క్వీన్ రుద్రమ దేవి కి బర్త్ డే శుభాకాంక్షలు అంటూ గుణశేఖర్ ట్వీట్ చేశారు. అరుంధతి , బాహుబలి , వేదం , రుద్రమ దేవి , భాగమతి మూవీస్ లోని క్యారెక్టర్స్ ఫొటోలతో రూపొందిన అనుష్క బర్త్ డే సీడీపీ ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























