స్టార్ రైటర్ యండమూరి వీరేంద్ర నాథ్ తన నవలలతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. యండమూరి నవలలో “ఆనందో బ్రహ్మ ” తప్ప మిగతా నవలలు అన్నీ సినిమాలు గా రూపొందాయి. చిరంజీవి , బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో తెరకెక్కాయి. 30 సినిమాలకు పైగా యండమూరి రచనా సహకారాన్ని అందించారు. స్టేట్ సాహిత్య అకాడమీ , రెండు నంది అవార్డ్స్ అందుకున్న యండమూరి దర్శకుడిగా రెండు మూవీస్ కు దర్శకత్వం వహించారు. ఇప్పుడు యండమూరి నవల “ఆనందో బ్రహ్మ ” హాలీవుడ్ మూవీ గా తెరకెక్కనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




1729 హాలీవుడ్ నిర్మాణ సంస్థ అధినేత ముక్తేష్ రావు మేక “ఆనందో బ్రహ్మ “నవలను హాలీవుడ్ మూవీ గా రూపొందించడానికి రైట్స్ ను స్వంతం చేసుకున్నారు. గోదావరి నది బ్యాక్ డ్రాప్ లో రూపొందిన నవలను మిసిసిపీ నది బ్యాక్ డ్రాప్ లో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్నానని ముక్తేష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా యండమూరి మాట్లాడుతూ తన నవలలు అన్నీ సినిమాలుగా రుపొందాయనీ , ఇప్పుడు “ఆనందో బ్రహ్మ “నవల కూడా తెరకెక్కడంతో తన కల సాకారం అయిందనీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























