మన హీరోలే కాదు హీరోయిన్స్ కూడా ఫిట్ నెస్ విషయంలో ఈ మాత్రం తీసిపోరు అని ఇప్పటికే రకుల్, సమంత, రష్మిక, పూజా హెగ్డే ఇలా పలువురు హీరోయిన్స్ నిరూపించారు. ఇక సమంత అయితే ఈ మధ్య యోగా కూడా స్టార్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా సమంత సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో పోస్ట్ చేస్తూ అందులో 108 సార్లు సూర్య నమస్కారాలు చేసినట్టు తెలుపుతుంది. 108 సార్లు సూర్య నమస్కారాలు చేసి…ఈ వీకెండ్ కు గుడ్ స్టార్ట్ అంటూ .. తన ఫిట్నెస్ ట్రైనర్ సంతోష్‌కు ధన్యవాదాలు తెలిపారు.ఇక ఇందుకు స్పందించిన సంతోష్.. ‘‘ సరైన దారిలో నడిచేందుకు ఎలాంటి షార్ట్కట్లు ఉండవని ఆమె నిరూపించారు. కఠిన శ్రమ, అంకిత భావం, సుస్థిరతకు నిదర్శనం. ఎటువంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు ఆమె ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎప్పుడూ నో చెప్పరు’’అని సమంతపై ప్రశంసలు కురిపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు సమంత వరుస సినిమాలు కూడా చేసుకుంటూ వెళ్తుంది. గత యేడాది నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమా ఆ తర్వాత ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఓ బేబి’ బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టాయి. ’96’ రీమేక్‌లో చేసినా అది కాస్త నిరాశ పరిచింది. ఈ వెబ్ సిరీస్ తో పాటు ఇంకా గేమ్ ఓవర్ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తుంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తుంది. తెలుగులో అయితే ఇంకా ఏ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టలేదు సామ్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: